YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొత్త రకం పాలనలో జగన్

కొత్త రకం పాలనలో జగన్

కొత్త రకం పాలనలో జగన్
విజయవాడ, మే 8,
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కి కూడా కేసీఆర్ అంటే బాగా అర్ధమైపోయింది. అందుకే ఆయన కూడా సింగిల్ విండోనే తెరచి మరీ ఏపీ వైపే చూపు పెట్టాడు. ఈ విషయంలో చంద్రబాబు ఎపుడో పండిపోయారు. ఆయనకు కేసీఆర్ ఒకనాటి శిష్యుడు కాడని, తనకంటే నాలుగాకులు ఎక్కువే చదివాడని 2015 నాటికే అర్ధమైపోయింది. అందుకే రాత్రికి రాత్రి తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి వచ్చేశారు. నాటి నుంచి కేసీఆర్ మీద చంద్రబాబు ఒక్క విమర్శ చేస్తే ఒట్టు. కేసీఆర్ కి భయపడి బాబు తన పార్టీని కూడా తెలంగాణాలో వదిలేసుకున్నారని అంటారు. ఇది చాలు కేసీఆర్ కి. ఇక ఎంతసేపూ ఏపీ మీదనే పడుతూ తన జాతీయ అనుభవాన్ని అంతా రంగరిస్తున్న బాబుకు పవన్ శిష్యుడు తోడు అయ్యారులా ఉంది.ఈ మాట అన్నది బాబు సొంత బావమరిది బాలయ్యే కాబట్టి ఆ సినీ డైలాగునే బట్టి పట్టి మరీ చంద్రబాబు ఏపీవైపే చూస్తూ బీపీ పెంచేసుకుంటున్నారు. ఇంతకు మించిన రాజకీయం, సమస్యలు ఉన్నా కూడా ఆయన తెలంగాణ వైపు అసలు తొంగిచూడడంలేదు. చెప్పాలంటే ఏపీలో కొత్త రకం పాలనకు, రాజకీయానికి జగన్ తెర తీశారు. తెలంగాణాలో రోటీన్ పాలిటిక్స్ చేస్తున్నారు కేసీఆర్. యావత్తు విపక్షాలను తన పార్టీలోకి కలిపేసుకుంటూ వారిని హేళన చేస్తున్నారు. గొంతు నొక్కి మరీ తానే మొనగాడినని గట్టిగా చెప్పుకుంటున్నారు. మరి బాబు లాంటి గండరగండడు అవసరం రాజకీయంగా తెలంగాణ ప్రజలకు, ఆయన పార్టీకి కూడా ఎక్కువగా ఉంది, కానీ బాబు కిక్కురుమనరే.నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తన పార్టీ రంగులను పంచాయతీ ఆఫీసులకు వేసిందని టీడీపీ గగ్గోలు పెట్టింది. దాని మీద టీడీపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లారు కూడా. కోర్టు సైతం ఈ పిటిషన్ల మీద విచారించి రంగులు మార్చేయమంది. దీంతో కోర్టు ఉత్తర్వుల తరువాత మరో రంగు అదనంగా వేసి మరీ వైసీపీ కొత్త ఉత్తర్వు తెచ్చింది. దాన్ని కూడా కోర్టు తాజాగా సస్పెండ్ చేసింది. సరే ఏపీలో రంగుల గురించి ఇంత రచ్చ జరుగుతోంది కదా తెలంగాణాలో బాగుందా అంటే అక్కడ ఇంతకు మించి అంటున్నారు బీజేపీ నేతలు, అక్కడ శ్మశానాలకు కూడా గులాబీ రంగులు పూసేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రఘునందనరావు ఆరోపిస్తున్నారు. ఇదేమి రంగుల రాజకీయమని ఆయన అంటున్నారు. మరి ఏపీ వైపే చూస్తున్న చంన్నబాబు కానీ పవన్ కానీ కేసీఆర్ ని ఈ విషయంలో ప్రశ్నించగలరా?ఇక ప్రపంచమంతా కరోనా ఉంది. మద్యం దుకాణాలు దేశమంతా తెరిచారు. ప్రభుత్వ ఆఫీసులకు రంగులు వేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు టైంలో కూడా పసుపు రంగుకు యమ గిరాకీ ఉండేది. అయినా సరే ఇపుడు జగనే ఏదో తప్పు చేశాడంటూ విపక్షాలు కోరస్ గా గొంతు చించుకోవడం అంటే జగన్ ని చూస్తే వారికి అలుసు అనుకోవాలేమో. జగన్ ఏం అనడు, కనీసం తమ విమర్శలపైన నోరు విప్పి మాట్లాడడు అన్న ధైర్యంతోనే ఏపీలో ప్రతి దానికీ ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయనుకోవాలేమో. లేకపోతే తాను పోటీ చేసిన చోట ఒక్క సీటు గెలవని పవన్ కల్యాణ‌్ కూడా మోడీని, కేసీఆర్ ని వదిలేసి ఒక్క జగన్ మీదనే రాజకీయ బాణాలు బాగానే వేస్తున్నాడుగా. అది తెలివిమీరిన రాజకీయమనుకోవాలేమో. జగన్ ఇకనైనా గట్టిగా ఉండాలని, విపక్షాలకు ధీటుగా స్పందించాలని సొంత పార్టీలో వినిపిస్తున్న మాట. లేకపోతే వైసీపీకి రంగులు పూసేలా విపక్షం రెడీగా ఉంది.

Related Posts