209 కుటుంబాలు..626 మంది కేసులు
హైద్రాబాద్, మే 8
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారిలో ఎక్కువ మంది 209 కుటుంబాల నుంచి వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ గుర్తించింది. వీ రిలో విదేశాలు, మర్కజ్ లింక్ నుంచి వచ్చిన కేసులూ ఉన్నాయి. ఈ కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మందికి వైరస్ సోకినట్లు అధికారు లు నిర్ధారించారు. ఈమేరకు ఒక ప్రత్యేక నివేదికను కూడా తయారు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం వరకు 1085 మం ది బాధితులు కాగా, ఈ 209 కుటుంబాల నుంచే 626 మంది ఉండటం ఆందోళనకరం. ప్రస్తుతం రాష్ట్రంలో క్రమంగా కరోనా కంట్రోల్ అవుతుందని, తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికను తయారు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా కట్టడిపై ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో మరింత పటిష్ఠమైన నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి ఆగమ్యగోచరంగా తయరయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.గ్రేటర్ పరిధిలో 89 కుటుంబాలలో ఒకరి కంటే ఎక్కువ మందికి వైరస్ సోకింది. దీనిలో హైదరాబాద్ పాతబస్తీ తలాబ్ కట్టకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఏకంగా 19 మంది కుటుంబ సభ్యులకు వైరస్ సోకడం గమనార్హం. ఈ వ్యక్తి మర్కజ్ వెళ్లోచ్చాడని, ఉమ్మడి కుటుంబం కావడంతో ఎక్కువ మందికి వైరస్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అదే విధంగా పాతబస్తీకి చెందిన మరో కుటుంబంలో కూడా 14 మందికి వైరస్ సోకింది. ఈ కుటుంబ సభ్యుల్లోనూ ఓ వ్యక్తి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లోచ్చాడు.దీంతో ఈ సభ్యులందరికీ వైరస్ సోకగా, ఒక మహిళ మృతి చెందిందని అధికారులు తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం ఈమె అంత్యక్రియాల్లో పాల్గొన్న వారందరికీ పరీక్షలు నిర్వహించగా, మరి కొందరికి కూడా వైరస్ సోకిందని వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చికిత్స పొందిన అనంతరం ఈ కుటుంబంలో 13 మందికి నెగటివ్ రిపోర్టు రాగా, అందరిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ జిల్లా తర్వాత ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో 19 కుటుంబాలు వైరస్ బారిన పడ్డాయి