YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఔరంగబాద్ లో ఘోర రైలు ప్రమాదం

ఔరంగబాద్ లో ఘోర రైలు ప్రమాదం

ఔరంగబాద్ లో ఘోర రైలు ప్రమాదం
మహారాష్ట్ర, మే 8
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. పట్టాలపై నిద్రిస్తోన్న 14 మంది వలస కూలీల ప్రాణాలను వేగంగా దూసుకొచ్చిన రైలు బండి బలి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు సొంతూరుకు వెళ్లే క్రమంలో.. రాత్రి సమయంలో పట్టాలపై నిద్రించారని తెలుస్తోంది. కానీ గూడ్స్ రైలు రూపంలో మృత్యువు వారిని కబళించింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం బాధిస్తోంది. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్-జల్నా రైల్వే లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది.రైలు వేగంగా దూసుకొని వచ్చి ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కాగా ఉదయం 6 గంటలకు సమాచారం అందడంతో పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి బయల్దేరారు.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. వలస కూలీలను ప్రత్యేక రైళ్లలో స్వరాష్ట్రాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైన వలస కూలీలంతా రైలు ఎక్కడానికి జల్నా నుంచి భుసావాల్ వెళ్తున్నారని సమాచారం. 35 కి.మీ. దూరం నడిచాక అలసిపోయిన వీరు విశ్రాంతి తీసుకోవడం కోసం వీరు పట్టాలపై నిద్రించారని తెలుస్తోంది.

Related Posts