YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తనిఖీల తర్వాతే పరిశ్రమలో పని

తనిఖీల తర్వాతే పరిశ్రమలో పని

తనిఖీల తర్వాతే పరిశ్రమలో పని
హైద్రాబాద్, మే 8,
విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్ పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో గ్యాస్‌ను ఉపయోగించే 36 పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.విశాఖ గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో గ్యాస్‌‌లను ఉపయోగించే 36 పరిశ్రమలను గుర్తించిన ప్రభుత్వం.. ఆ యూనిట్లలో తనిఖీ చేపట్టాలని భావిస్తోంది. ఏ యూనిట్లలోనైనా స్టిరేన్ వాయువును ఉపయోగిస్తున్నారా అనేదాన్ని కూడా అధికారులు చెక్ చేయనున్నారు. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ విభాగాల ఆధ్వర్యంలో మూడు రోజుల్లో ఈ తనిఖీ ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.‘రాష్ట్రంలో 36 యూనిట్లు ఇండస్ట్రియల్ గ్యాస్‌లను వాడుతున్నాయి. వీటిలో చాలా వరకు రూ.50 కోట్ల వరకు పెట్టుబడి ఉన్న మధ్యశ్రేణి పరిశ్రమలే’ అని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.రాష్ట్రంలో ఓ పరిశ్రమ ఏర్పాటుకు అనేక దశల్లో అనుమతి మంజూరవుతుంది. పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక విభాగాలతోపాటు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. పరిశ్రమలు ఏమేం నిల్వ చేస్తాయనే విషయాన్ని కూడా పీసీబీ పర్యవేక్షిస్తుందని రంజన్ తెలిపారు. విశాఖ ఘటన నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Related Posts