పదహారుకు చేరిన రైలు ప్రమాద మృతుల సంఖ్య
ఔరంగాబాద్ మే 8,
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పదహారుకు చేరింది. రైలు పట్టాలపై నిద్ర పొతున్న వలసకూలీలపై గూడ్స్ రైలు దూసుకుపోయిన ఘటన తెలిసిందే. ఘటన సమయంలో ఇరవై మంది పట్టాలపై నిద్ర పోతున్నారు. మధ్య ప్రదేశ్ కు చెందిన వీరంతా జాల్నా నుంచి భుసవాల్ కు నడిచి వెళుతున్నారు. లాక్ డౌన్ నేపద్యంలో రైలు నడవడంలేదని భావించి వీరంతా పట్టాలపై నిదురించారని పోలీసులు అంటున్నారు. ప్రమాదంనుంచి తప్పించుకున్న నలుగురు షాక్ కు గురయ్యారు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనలో మృతుల చెప్పులు, వ్యక్తిగత వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి. వారు దాచిపెట్టుకున్న చపాతీలు కుడా రైలు పట్టాలపై పడివున్నాయి. చివరి నిమిషంలో పట్టాలపై పడుకున్న వారిని గుర్తించిన రైలు డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడని రైల్వే శాఖ ప్రకటించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని ట్వీట్టర్ లో పేర్కోంది. మద్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ చౌహన్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున నష్టపరిహాం ప్రకటించారు.