మద్యం దుకాణాలు మూసివేయాలి
విజయవాడ మే 8,
కరోనా ప్రభావంతో సమావేశం పెట్టాలన్నా భయంగా ఉంది. 9 గంటల్లోపు అన్ని ముగించాలని చెప్తుంటే చిన్న మద్యం బాటిల్ కొనుక్కోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. మద్యం కొనుక్కునేవారికి కనీసం భయం లేదు,నిత్యావసరాలకు 3 గంటలు, మద్యానికి మాత్రం సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసరాలు, మద్యంకు ఇచ్చే ప్రాధాన్యత ప్రభుత్వానికి పేదల సంక్షేమంపై లేదు. బుక్ షాప్ లు తెరిస్తే కరీనా వస్తుంది ,కానీ మద్యం దుకాణాలు తెరిస్తే రాదా. మద్యం దుకాణాలు తీయడమే కాకుండా ,కేంద్రం తెరుచుకోమంది అని చెప్పడం సరైనది కాదని అయన అన్నారు. 40 రోజులు మద్యం తాగకపోయిన మందుబాబులు బ్రతుకుతున్నారు,కానీ మద్యం పై ఆదాయం లేనిదే ప్రభుత్వం బ్రతకలేకపోతుంది. దశలవారీగా మద్యపాన నిషేధం అని చెప్పి ధరలు పెంచితే ,మీ అబద్ధాలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు.తాగే వారికి లోక్డౌన్ వర్తించదా,తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయాలని అయన డిమాండ్ చేసారు