కైలాస మానససరోవరానికి కొత్త రూటు ప్రారంభం..
టిబెట్, ఉత్తరాఖండ్ సరిహద్ద మార్గంలో లిపులేక్ నుంచి రూటు
న్యూ ఢిల్లీ మే 8
టిబెట్ లోని కైలాస మానససరోవరానికి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. అయితే మానస సరోవరాన్ని త్వరగా చేరేందుకు ఇవాళ కొత్త మార్గాన్ని ప్రారంభించారు. టిబెట్, ఉత్తరాఖండ్ సరిహద్ద మార్గంలో లిపులేక్ నుంచి ఈ రూటును వేశారు. 80 కిలోమీటర్ల ఆ మార్గాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ ఓపెన్ చేశారు. అయితే ఈ రూటులో వెళ్తే లిపుకేక్ పాస్ నుంచి కైలాస మానస సరోవరం సుమారు 90 కిలోమీటర్లు ఉంటుంది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ రోడ్డు మార్గాన్ని మంత్రి ఓపెన్ చేశారు. ఈ రూటులో వెళ్లే యాత్రికులు కేవలం వారం రోజుల్లోనే తమ ప్రయాణాన్ని ముగించుకుంటారన్నారు. ఇతర పాత రూట్లలో మానస సరోవరానికి వెళ్లేందుకు కనీసం మూడు వారాల సమయం పట్టేది. ఉత్తరాఖండ్‌లోని ఘటియాబాగర్ నుంచి టిబెట్‌లోని లిపులేక్ పాస్ వరకు కొత్త రోడ్డు మార్గం వేశారు. ఈ రోడ్డుతో దశాబ్ధాల కలం నిజమైందని, స్థానికులు, భక్తుల ఆంకాక్షలు నెరవేరినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఈ రోడ్డు మార్గం వల్ల వాణిజ్యం కూడా పెరుగుతుందన్నారు. దళాల తరలింపుంలోనూ ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా పనిచేస్తుందని మిలిటరీ అధికారులు చెప్పారు.