. జూన్ 20 లోగా రైతులు నాట్లు వేయాలి
-రోహిణి కార్తి లోనే తూకాలు పోయాలి -రూ 25 వేల లోపు ఉన్న రైతుల రుణలు మాఫీ -కొనుగోలు కేంద్రాలకు 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యం తేవాలి --రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, మే 8
రైతులు రోహిణి కార్తి లో తూకాలు పోసి జూన్ 20 లోగా నాట్లు వేస్తే బ్రహ్మాండమైన దిగుబడి వస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు శుక్రవారం నిర్మల్ పట్టణంలోని గాజులపేట లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు సకాలంలో తూకాలు పోసి నాట్లు వేస్తే ధాన్యం అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగిపోయాయని, రైతుబంధు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రూ 25 వేల లోపు ఉన్న రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేటప్పుడు తాలు, తప్ప లేకుండా జల్లెడ పట్టి సంచలను నింపి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.17 శాతం లోపు తేమ ఉన్నా ధాన్యాన్ని తేవాలన్నారు. గన్ని సంచులకు కొరత లేదని, ట్రాన్స్ పోర్ట్, రైస్ మిల్లులకు కు ఇబ్బంది లేదని తెలిపారు. మే 29 వరకు లాక్ డౌన్ ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రాత్ ఈశ్వర్, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవొతు రాజేందర్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, సోన్ జెడ్ పి టి సి జీవన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజి కుమార్, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు కె రామ్ కిషన్ రెడ్డి, సత్య నారాయణ గౌడ్, మారుగొండ రాము, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.