YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ విదేశీయం

చెన్నమనేని పౌరసత్వంపై విచారణ

చెన్నమనేని పౌరసత్వంపై విచారణ

చెన్నమనేని పౌరసత్వంపై విచారణ
హైద్రాబాద్, మే 9
మ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై చాలా కాలంగా వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఒకవైపు కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని మరోవైపు కేంద్ర హోంశాఖ పౌరసత్వం రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలని వాద ప్రతివాదనలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వాదప్రతివాదాలు విన్న తర్వాత తదుపరి విచారణను జూన్ 16కు హైకోర్టు వాయిదా వేసింది.కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు. మరోవైపు, కేంద్ర హోంశాఖ పౌరసత్వం రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని చెన్నమనేని రమేశ్ హైకోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనలను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది.నాలుగు సార్లు ఉమ్మడి ఏపీ, తెలంగాణలోనూ చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. చెన్నమనేనికి జెర్మనీలో పౌరసత్వం ఉన్నందున అతడి ఎన్నిక చెల్లదని అభ్యంతరం వ్యక్తంచేస్తూ 2009లో అతడి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో 2017 సెప్టెంబరులో కూడా చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ సుప్రీం కోర్టుకి నివేదిక ఇచ్చింది. 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెన్నమనేని రమేశ్ ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ తరపున గెలుపొందారు. అయితే, ఈ రెండు ఎన్నికల్లోనూ చెన్నమనేని రమేశ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా అతడికి భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది
 

Related Posts