YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

తెలంగాణలో ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్
హైద్రాబాద్, మే 9,
తెలంగాణలో లాక్ డౌన్‌ను మే 29 వరకూ పొడిగిస్తూనే కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వం.. అతి ముఖ్యమైన ప్రజా రవాణా విషయంలోనూ సడలింపు ఇవ్వాలని యోచిస్తోంది. ఇప్పటికే గ్రీన్ జోన్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో ఆర్టీసీ నడపొచ్చని కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, కొన్ని కారణాల వల్ల తెలంగాణలో అది అమలు చేయలేదు. మరికొన్ని రోజుల్లో ప్రస్తుతం ఆరెంజ్ జోన్‌లో ఉన్న 18 జిల్లాలు గ్రీన్ జోన్‌లోకి మారిపోతాయని సీఎం చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాతి నుంచి కొన్ని షరతులతో ప్రజా రవాణాకు అనుమతించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.కరోనా మహామ్మారి కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. మే 15న జరిగే సమీక్షా సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటామని రెండ్రోజుల క్రితం సీఎం ప్రకటించారు. అప్పటికల్లా ఆరెంజ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారతాయని సీఎం కచ్చితంగా చెప్పిన వేళ.. మే 15 తర్వాత ప్రజా రవాణాకు నిబంధనలతో సడలింపు ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తే ఇకపై సిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణించేందుకు చెక్‌ పెట్టే యోచనలో అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి అనుమతించే అవకాశం ఉంది.ఇక మెట్రో రైలు విషయంలోనూ కొన్ని నిబంధనలు పెట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మూడు బోగీలున్న మెట్రో రైలును గతంలో రద్దీతో నడిపేవారు. తాజాగా పరిమిత సంఖ్యలో ప్రయాణికులను అనుమతించి రైళ్లను నడపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులు నిల్చునేందుకు వీలుగా తెలుపు రంగు సర్కిళ్లు ఏర్పాటు చేయాలని, స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్ల సదుపాయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మాస్కులు ఉంటేనే బస్సులోకి లేదా మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుమతించేలా నిబంధనలు తెస్తున్నట్లు సమాచారం.

Related Posts