YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్‌ గిర్‌ అడవుల్లో కలకలం.. 23 మృగరాజులు మృతి!

గుజరాత్‌ గిర్‌ అడవుల్లో కలకలం.. 23 మృగరాజులు మృతి!

గుజరాత్‌ గిర్‌ అడవుల్లో కలకలం.. 23 మృగరాజులు మృతి!
న్యూ ఢిల్లీ మే 8
ఆసియా మృగరాజులకు పుట్టినిల్లు అయిన గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మరణమృదంగం జరుగుతోంది. అడవికి రాజైన సింహాలు.. గత మూడు మాసాల్లో 23 చనిపోయాయి. ప్రొటోజొవా పారాసైట్‌ కారణంగా వచ్చే బబేసియాతో.. ఈ సింహాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు జునాగఢ్‌కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి డీటీ వాసుదేవ పేర్కొన్నారు. బ్లడ్ ప్రోటోజోవా పారాసైట్‌ను బబేసియా అంటారని… ఇది కొన్ని విషపురుగులతో పాటుగా.. కీటకాల కుట్టడం ద్వారా వ్యాపిస్తుందన్నారు. అయితే ఇదేమీ అంటు వ్యాధి కాదని.. దీనికి చికిత్స ఉందని తెలిపారు. నేషనల్ పార్క్‌లోని చిన్న ప్రాంతంలో పెద్ద సింహాలన్నీ మృత్యువాత పడ్డాయని.. వ్యాధి బారినపడ్డ జంతువును తినడం వల్ల.. ఈ సింహాలకు కూడా సోకి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొన్ని సింహాలు… వృద్ధాప్యం, పాము కాట్లతో కూడా చనిపోయాయని తెలిపారు. మూడు నెలలుగా మరణించిన సింహాల మృమతిపై దర్యాప్తు కొనసాగుతోందని… త్వరలోనే దీనిపై పూర్తి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు.ఇదిలా ఉంటే.. గిర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో సింహాలు ఉంటాయి. అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా.. అక్కడ తరచూ సింహాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి

Related Posts