YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

ఎయిర్ ఇండియా బుకింగ్స్ షురూ

ఎయిర్ ఇండియా బుకింగ్స్ షురూ

ఎయిర్ ఇండియా బుకింగ్స్ షురూ
ముంబై, మే 8
లాక్ డౌన్ సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఒక అవకాశం లభించింది. భారత దేశం యొక్క జాతీయ క్యారియర్ అయిన ఎయిర్ ఇండియా లండన్, సింగపూర్, యూఎస్ వంటి దేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం అంతర్జాతీయ బుకింగ్స్ ను ప్రారంభించింది. ఈ విమానాలు మే 8 నుండి మే 14 మధ్య నడుస్తాయని ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు.ఎయిర్ లైన్స్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం... మే 8 మరియు మే 14 మధ్య నడిచే ఎయిర్ ఇండియా విమానాల ద్వారా భారత దేశం నుండి లండన్, సింగపూర్, యూఎస్ లోని గమ్యస్థానాలకు ప్రయాణికులు అందరూ బుకింగ్స్ చేసుకోవడం ప్రారంభించవచ్చు. ప్రయాణికులు బుకింగ్స్ చేసుకునే ముందు అర్హత ప్రమాణాలను పూర్తిగా చదివి, వాటికి తగిన విధంగా ఉంటేనే ప్రయాణాలకు సిద్ధపడాలని ఎయిర్ లైన్స్ సూచించింది.అదే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వందే భారత్ విమాన మిషన్ కూడా గురువారం ప్రారంభమైంది. దీని ద్వారా కొచ్చి నుండి అబుదాబికు, ఢిల్లీ నుండి సింగపూర్ కు, కాలికట్ నుండి దుబాయ్ కు ప్రయాణికులను తరలించారు. అలాగే ఈ మిషన్ లో భాగంగా సింగపూర్ లో చిక్కుకున్న భారతీయులను కూడా తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు మొదటి విమానం కూడా షెడ్యూల్ చేయబడింది. ఈ విమాన ప్రయాణాలకు సంబంధించి ఎయిర్ ఇండియా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) ప్రకారం పైలట్లు, సిబ్బందికి ఇప్పటికే కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించింది.నివేదికల ప్రకారం... ఇతర దేశాలలో ప్రయాణీకులకు సహాయం చేయడానికి ఎయిర్ లైన్స్ 64 ఫెర్రీ సేవలను నిర్వహిస్తుంది. ఎయిర్ లైన్స్ మరియు దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కలిసి మే 8 నుండి 14 వరకు ఈ మిషన్ లో ప్రజలను తమ స్వస్థలాలకు చేరుకోవడంలో సహాయపడతాయి.

Related Posts