చర్యలు మీరితే కేసులు తప్పవు
అక్రమ మద్యం పట్టివేత
ఎస్ హెచ్ ఓ రఫిక్ ఖాన్
వేములవాడ మే 8
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సమయానుకూలంగా వినియోగించుకోవాలని లాక్ డౌన్ నిబంధనలను ఎవరు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేయాల్సి వస్తుందని వేములవాడ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ ఐ రఫిక్ ఖాన్ సూచించారు. శుక్రవారం వేములవాడ పట్టణం లో అక్రమంగా మద్యం తరలిస్తున్నారు అనే సమాచారం మేరకు మద్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. వివరాలలోకి వెళితే దాదాపు 12000 /- రూపాయల విలువ గల మద్యం ను ప్రభుత్వం సూచించిన సమయం అయిపోయిన తర్వాత తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేయనయినది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ నిషేధ ఆజ్ఞలు పాటించ కుండా సమయం అయిపోయాక మ్యాకల శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం తరలిస్తుండడం తో పట్టుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని, ప్రభుత్వం సూచించిన సమయం లో మాత్రమే మద్యం విక్రయించాలని తెలిపారు.