YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గంటల పాటు వానలు

గంటల పాటు వానలు

ఉత్తర జార్ఖండ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. మరోవైపు దక్షిణ మహారాష్ట్ర నుంచి విదర్భ వరకు మరట్వాడా మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కొన్నిచోట్ల పెనుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రాత్రి నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురవవచ్చని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని అనంతపురం మినహా పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 41.4 డిగ్రీలు (+2.4) అధికంగా రికార్డయింది. విజయనగరం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. మెరుపువేగంతో వచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తాయని చెప్పారు. పొలం పనులు చేసుకుంటున్న అన్నదాతలపై విరుచుకుపడుతున్నాయి. వారిమీదే ఆధారపడిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కలవరం సృష్టించే అవకాశం ఉంది. మరో వైపు అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను వణికించాయి. వడగండ్ల వాన ధాటికి రాష్ర్టవ్యాప్తంగా పలుచోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఒంటిమిట్టలో నలుగురు మృతి.. యాభైమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కడప రిమ్స్‌లో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన సీఎం.. వారికి నష్టపరిహారాన్ని ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలుప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.కడప జిల్లా ఒంటిమిట్టను వడగండ్ల వాన ముంచెత్తింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆలయందగ్గరలోని చెట్లు, రేకుల షెడ్‌ నేలమట్టంకాగా.. బద్వేలువాసి చెన్నయ్య, పోరుమామిళ్ల వాసి వెంగయ్య, వెంకటసుబ్బమ్మ మతిచెందగా... మరో వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. 

Related Posts