ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ పి లు పునః ప్రారంభించాలి
నిత్యావసర వస్తువులు కొనుగోలు వెళ్లే వారి పై పోలీసుల దాడులు ఆపాలి
సీపీఐ పార్టీ డిమాండ్
నంద్యాల మే 8
నంద్యాల లొ శుక్రవారం నాడు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రిలలో ఓపి ను. పునః ప్రారంభించాలని. నిత్యావసర వస్తువులు కొనుగోలు వెళ్లే వారిపై పోలీసులు ఆపాలని.రెడ్ జోన్ ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో సరుకులు అందజేయాలని. కోరుతూ స్థానిక కార్యాలయం నందు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిందని. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ మస్తాన్ వ లి. ఎస్ బాబా ఫక్రుద్దీన్. ఎస్ ఎన్ డి రఫీ. పాల్గొన్నారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రిలను ఓ పి.ల ను ప్రారంభించి తెరవాలనికేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. ప్రైవేట్ ఆస్పత్రిలో ఓపి తెరవక పోవడం వల్ల. అనారోగ్యాలకు గురవుతున్నట్టు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అదేవిధంగా రెడ్ జోన్ ప్రాంతాలలో వాల్ ఎంట్రీ ద్వారా నిత్యావసర చేస్తామని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్న అవి అమలు కాకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా నిత్యవసర వస్తువులు లేకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. . ప్రభుత్వ అధికారులు ఉదయం 6 నుండి 9 వరకు నిత్యావసర వస్తువులు కూరగాయల తెచ్చు కొండని ఆదేశాలు ఇచ్చినా. పోలీస్ అధికారులు నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారి పై దాడులు చేయడం. వారిపై కేసులు పెట్టడం. వారి బండిని సీజ్ చేయడం లాంటి చేయడం బాధాకరమన్నారు . గత 45రోజులుగా పోలీసులు చేస్తున్న సేవలు ఉన్నతంగా ఉన్నాయని కానీ ఇలా ప్రజల పై దాడి చేయడం వల్ల నిర్వీర్యం అవుతుందని ఆవేదన. వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఆస్పత్రిలో ఒపి ల ను ప్రారంభించేందుకు కృషి చేయాలని. రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని. నాయకులు డిమాండ్ చేశారు.