మద్యం వద్దు ముద్ద కావాలని టిడిపి మహిళలు ధర్నా
నంద్యాల మే 8
నంద్యాల పట్టణంలో శుక్రవారం నాడు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మహిళ కార్యకర్తలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద రసన వ్యక్తం చేశారు. తాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తో ప్రజలు 40 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పేదల ఆకలి కేకలు వినపడడం లేదా అని. మద్యం షాపులు తెరవడం తో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని . 40 రోజులుగా ఆకలితో అలమటిస్తుంటే మద్యం దుకాణాలు తెరిచారని. అధిక ధరలతో ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నారని ఎన్నికల ముందు రాష్ట్రంలో మద్యపానం పూర్తిగా నిషేధిస్తారు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మహిళల ఆగ్రహానికి గురి అవుతున్నాడని . పని లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు సహాయం చేయకుండా దాచుకున్న డబ్బులు కూడా మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దోచేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలలో ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని దీనిని తగ్గించాలి అంటే వెంటనే మద్యం దుకాణాలను మూసివేసి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలని. పరిశ్రమలను తెరిచి కార్మికులకు పనులు కల్పించాలని కోరారు.