YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఖజనాకు మద్యం కిక్కు

ఏపీ ఖజనాకు మద్యం కిక్కు

ఏపీ ఖజనాకు మద్యం కిక్కు
గుంటూరు, మే 9
ఏపీలో 45 రోజుల తర్వాత మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు తెరుచుకున్నాయి. మద్యం విక్రయాలు స్టార్ట్ అయ్యాయి. ఇన్నాళ్లు మద్యం దొరక్క విలవిలలాడిన మద్యం ప్రియులు, ఇప్పుడు ఎగబడి మద్యం కొంటున్నారు. దీంతో తొలి రోజే రికార్డ్ స్థాయిలో కోట్ల రూపాయల్లో మద్యం విక్రయాలు జరిగాయి. ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వచ్చింది. అయితే మద్యం వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. ఏకంగా 75శాతం పెంచింది. దీంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చినట్టు అయ్యింది.కాగా, రాష్ట్రంలో గతేడాది తరహాలోనే మద్యం విక్రయాలు జరిగితే.. భారీగా పెంచిన ధరల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.30 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అంటే 2019 కంటే రూ.13 వేల కోట్ల మేర అదనపు ఆదాయమొచ్చే అవకాశముంది. 2019లో మొత్తం విక్రయ విలువలో 84.60శాతం ఆదాయం.. లైసెన్సు రుసుములు, ఎక్సైజ్ సుంకం, వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, ప్రివిలేజ్ ఫీజు, రిటైల్ ఎక్సైజ్ సుంకం, అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం తదితరాల రూపంలో ఇది సమకూరింది.  ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచిన నేపథ్యంలో... గతేడాది పరిమాణంలోనే మద్యం అమ్ముడైతే...దాని విలువ దాదాపు రూ.36,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ మొత్తంపై సుమారు 84 శాతం వరకూ వివిధ రకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ లెక్కన రూ.30 వేల కోట్ల వరకూ ఆదాయం సమకూరే అవకాశముందిసాధారణంగా ఏటా అమ్ముడయ్యే మద్యం పరిమాణంలో వృద్ధి నమోదవుతుంటుంది. గతేడాది మాత్రం కొంత తగ్గుదల నమోదైంది. అమ్ముడైన మద్యం పరిమాణం తగ్గినా... అప్పటికే ఒకసారి మద్యం ధరలు పెంచటంతో.. అంతకు ముందేడాదితో పోలిస్తే ఆదాయం మాత్రం పెరిగింది. తాజాగా మద్యం ధరలను 75 శాతం పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అమ్ముడయ్యే మద్యం పరిమాణం కొంత తగ్గే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.దాదాపు రూ.47 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ధరలు భారీగా పెంచిన నేపథ్యంలో అమ్మిన మద్యం పరిమాణం తగ్గినప్పటికీ, విక్రయ విలువ మాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో సగటున రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. సోమవారం రూ.68 కోట్లు, మంగళవారం రూ.30 కోట్ల మద్యాన్ని విక్రయించారు. గత మూడు రోజుల్లో రూ.145 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు.కాగా, దశల వారీగా మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా మద్యనిషేధం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ స్వయంగా చెప్పారు. తాగేవారికి షాక్ తగలాలనే ధరలు 75 శాతం పెంచామన్నారు. గత ప్రభుత్వంలో 43 వేల బెల్ట్ షాపులు ఉండేవని, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నింటినీ తొలగించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి చెప్పారు.

Related Posts