YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్

చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్

అంతర్జాతీయ ఆర్థిక సదస్సుల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడ నాలుగురోజుల పాటు ఆయన తన పర్యటనను కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా 22వ తేదీ సదస్సులో ప్రసంగించనున్న చంద్రబాబు.. ఆ తరువాత క్రిస్టల్ అవార్డుల వేడకల్లో, డీఐపీపీ ఏర్పాటు చేసే ఇండియా రిసెప్షన్‌కు వెళ్లనున్నారు.

23వ తేది ఏపీ లాంజ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని.. మధ్యాహ్నం నుంచి పలు కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు. అదే రోజు ప్రధాని మోదీ కూడా ఏపీ లాంజ్‌ను సందర్శించనున్నారు. ఇక 24వ తేది టెక్నాలజీస్ ఫర్ టుమారో అనే అంశంపై చర్చాగోష్టి, ఆ తరువాత సీఐఐ సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం, బెహ్రయిన్ పెట్రోలియం కంపెనీ చైర్మన్ షేక్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఇవ్వనున్న డిన్నర్ సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే 25వ తేది వివిధ కంపెనీలతో సీఈవోలతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు చంద్రబాబు.

Related Posts