YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

భోపాల్ లో కొనసాగుతున్న హై డ్రామా

భోపాల్ లో కొనసాగుతున్న హై డ్రామా

భోపాల్ లో కొనసాగుతున్న హై డ్రామా
భోపాల్, మే 9,
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. చేజేతులారా తన ప్రభుత్వాన్ని తానే కూలదోసుకుంది. ఇందులో కమల్ నాధ్ పాత్ర ముఖ్యం. ఆయన పోకడల వల్లనే జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడారు. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. నిజానికి ప్రమాదపు అంచున ఉన్న ప్రభుత్వాన్ని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా కమల్ నాధ్ దే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.కానీ కమల్ నాధ్ కావాలని యువనేత జ్యోతిరాదిత్య సింధియాను పక్కనపెట్టారు. భవిష్యత్తులో తన రాజీకీయానికి బ్రేకులు వేస్తారని భావించి కమల్ నాధ్ జ్యోతిరాదిత్య సింధియాను రెచ్చ గొట్టారు. ప్రభుత్వంలో సంగతి పక్కన పెడితే చివరకు పీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ సింధియా కాకుండా అడ్డుకున్నారు కమల్ నాధ్. ఇది సింధియా ఆగ్రహానికి కారణమయింది. ఫలితంగా కమల్ నాథ్ పది రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి అయ్యారు.కేంద్రంలో బలంగా మోదీ, అమిత్ షా ఉన్నారని తెలిసి కూడా కమల్ నాధ్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు 24 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆరునెలల్లో రాజీనామా చేసిన స్థానాలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. అంటే ఆగస్టు నెలలోపు 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. బీజేపీ మాత్రం కర్ణాటక తరహాలో ఉప ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాలో ఉంది. పూర్తి బాధ్యతను జ్యోతిరాదిత్య సింధియాపై పెట్టింది. సింధియా పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు, కాంగ్రెస్ క్యాడర్ కు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో వివరించనున్నారు.కమల్ నాథ్ మాత్రం మధ్య ప్రదేశ్ లో కర్ణాటక సీన్ రిపీట్ కాబోదన్న విశ్వాసంతో ఉన్నారు. తిరిగి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లో అధికారం చేపడుతుందని ప్రకటించుకున్నారు. ఉప ఎన్నికలు జరిగే 24 స్థానాల్లో 22 స్థానాలు సింధియా మద్దతుదారులవే. మిగిలిన రెండు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కమల్ నాథ్ కు ఆ స్థానాలను గెలిపించుకునే సత్తా ఉందా? అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి ఇది పరీక్షగానే చెప్పుకోవాలి. కానీ బీజేపీ బలంగా ఉన్న మధ్యప్రదేశ్ లో కర్ణాటక సీన్ రిపీట్ కాదన్న గ్యారంటీ అయితే లేదు.

Related Posts