YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సెప్టెంబర్ నాటికి పోలవరం

సెప్టెంబర్ నాటికి పోలవరం

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. 2019 ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇవ్వాలని అధికార టిడిపి ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల చోటు చేసుకొంటున్న పరిణామాలతో అధికార పార్టీ నిర్ణయాలు ఏ మేరకు ఫలిస్తాయోననే ఆందోళన కూడ లేకపోలేదు. అసలు వివాదమేమిటీ? ఎందుకు ఏపీలో పోలవరం ప్రాజెక్టు విషయమై పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోందో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలను తీసుకొంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం పనుల్లో వేగం అనుకొన్నంతగా లేదని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చొరవ కారణంగానే ప్రాజెక్టు పనుల్లో ఈ మేరకైనా పురోగతి ఉందంటున్నారు అధికార పార్టీ నేతలు పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ మట్టి పనులు జూన్ నాటికి పూర్తికానున్నాయని ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ కె విజయానంద్ చెప్పారు. ఏపీ జెన్కో అడ్వయిజర్ ఆదిశేషు, డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్లు ప్రభాకరరావు, రత్నబాబు, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, కెపిఎంజి కన్సల్టెంట్స్, వేప్కాస్ ప్రతినిధులు శుక్రవారం అంగుళూరు, దేవీపట్నంలో జరుగుతున్న పోలవరం పవర్‌హౌస్ పనులను పరిశీలించారు. పోలవరం పవర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొలగాని వివిఎస్ మూర్తి బృందానికి పవర్‌హౌస్ పనులను వివరించారు. 960 మెగావాట్ల పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు ఎప్రోచ్ ఛానల్, పవర్‌హౌస్ పిట్, ఇన్‌టేక్ స్ట్రక్చర్, టైల్‌రేస్ ఛానల్ పనులను వారంతా క్షుణ్ణంగా పరిశీలించారు. పవర్ ప్రాజెక్టు మట్టి పనులు జూన్ నెలలో పూర్తిచేసి పవర్‌హౌస్ కాంక్రీటు పనులు త్వరలోనే మొదలు పెట్టి నిర్దేశించిన గడువులోపు పూర్తిచేస్తామని ఎండీ విజయానంద్ తెలిపారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన నాటి నుంచి 40 నెలల్లో మూడు యూనిట్లు పూర్తి చేస్తామని, అక్కడ నుంచి ప్రతి రెండు నెలలకు ఒక యూనిట్ వంతున పూర్తిచేసి మొత్తం ప్రాజెక్టు 58 నెలల్లోనే పూర్తిచేస్తామని చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా పోలవరం పవర్‌హౌస్ నిలుస్తుందన్నారు

Related Posts