YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

వైన్ షాపులు వెలవెల

వైన్ షాపులు వెలవెల

వైన్ షాపులు వెలవెల
హైద్రాబాద్, మే 9,
లాక్‌డౌన్ విధించడంతో మూత పడ్డ మద్యం దుకాణాలు మూడు రోజుల క్రితం తెరవడంతో మందు బాబులు క్యూకట్టారు. వీరి తాకిడితో కొన్ని ప్రాంతాల్లో మందు నిల్వలు కూడా అయిపోవడంతో షాపులు మూసివేశారు. అయితే మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం మద్యం షాపుల ముందు మందుబాబుల లైన్లు కన్పించలేదు. చాలా చోట్ల వెలవెలబోయాయి. కొన్ని ప్రాంతాల్లో గిరాకీ లేకపోవడంత మధ్యాహ్నాం సమయంలో షాపులను మూసివేశారు. మళ్లీ మద్యం షాపులు మూసివేస్తారనే భయంతో చాలామంది భారీ ఎత్తున రెండు రోజులు మద్యం కొనుగోలు చేశారు.మద్యం షాపులు తెరిచిన మొదటి రోజు పురుషులు, మహిళలు, యువతులు భారీ ఎత్తున కొనుగోలు చేశారు. దీంతో ఒక్కసారిగా మద్యానికి గిరాకీ లేకుండా పోయింది. ఎక్కడ చూసిన మద్యం షాపుల వద్ద పదిమందికి మించి లేరు. సాధారణంగా మద్యం షాపుల వద్ద సాయంత్రం సమయంలో ఎక్కువగా ఉంటారు. కాని మద్యం షాపులు 42 రోజుల తర్వాత తెరవడంతో చాలామంది ఉదయం 4గంటల నుంచి లైను కట్టారు. అంతేకాకుండా మద్యం షాపులను గతంలో రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంచేవారు. ఇప్పడు తెలంగాణ ఫ్రభుతం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు తీసి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడంతో అప్పటి వరకు కొనుగోలు చేస్తున్నారు. అందుకే మొదటి రెండు రోజులు మద్యం షాపుల వద్ద భారీ లైన్లు కన్పించాయి.మద్యం షాపులు తెరిచిన సామాజిక దూరం పాటించే విధంగా పోలీసులు రెండు రోజులు ఉండి భద్రతను పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ లైన్‌లో ఉండాలని, సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు. ఆయా మద్యం షాపుల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. మద్యం కొనుగోలు చేసేవారు తగ్గడంతో పోలీసులు భద్రతను ఉపసంహరించుకున్నారు. కానీ సామాజిక దూరం పాటించాలని,మాస్కులు ధరించాలని లేకుంటే షాపులను మూసివేస్తామని ఆదేశించారు.

Related Posts