కరీంనగర్ లో సరిబేసి విధానం
కరీంనగర్, మే 9,
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాల్లో సరి బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి తెలిపారు. కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే నగరంలోని దుకాణాలకు నంబర్లు కేటాయిస్తున్నారు. కేటాయింపు ప్రకారం సరి బేసి తేదీల్లోనే దుకాణాలు తెరవాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే కార్పొరేషన్ లో మొత్తం దుకాణాలను మూడు క్యాటగిరీలుగా విభజించారు. క్యాటగిరీ ఏ: నిత్యావసర దుకాణాలు, మద్యం దుకాణాలు, నిర్మాణ రంగానికి సంబందించిన దుకాణాలు క్యాటగిరీ బీ: బట్టల దుకాణాలు, పాదరక్షల దుకాణాలు వంటివి క్యాటగిరీ సీ: హోటల్స్, స్కూల్స్, సినిమా హాల్స్, జిమ్స్ ఇందులో క్యాటగిరీ ఏ లో ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు, క్యాటగిరీ బీ లో సరి బేసి విధానాలు అమలు, క్యాటగిరీ సీ లో దుకాణాలు తెరవకుండా చర్యలు తీసుకోనున్నారు. క్యాటగిరీ వారిగా దుకాణాలు తెరచి సామాజిక దూరం పాటిస్తూ విక్రయాలు జరుపుకోవాలని కమిషనర్ క్రాంతి వ్యాపారులకు సూచించారు. అలాగే మాస్కులు, సానిటైజర్లు తప్పక వాడాలి. మాస్కు లేకుండా ఏ వ్యాపారి అమ్మకాలు జరుపకూడదు. షాపులో తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ప్రజలు పట్టుకునే చోట్ల రెడ్ మార్కింగ్ చేయాలి. లేదా అలాంటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబందిత వ్యక్తలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు తనిఖీలు జరపనున్నట్లు కమిషనర్ క్రాంతి తెలిపారు.