YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

క్లాస్ రూమ్స్ లో సోషల్ డిస్టెన్స్

క్లాస్ రూమ్స్ లో సోషల్ డిస్టెన్స్

క్లాస్ రూమ్స్ లో సోషల్ డిస్టెన్స్
వరంగల్, మే 9
జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ ఓపెన్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా..ఇప్పటికే విద్యా సంవత్సరం లాస్ అయిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల కంటే ఎక్కువగానే ఈసారి పాఠశాలలకు హాలీడేస్ వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతన్న విషయం తెలిసిందే.2020, మే 29వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. కానీ..కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కట్టడి కాకపోవడంతో లాక్ డౌన్ పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. పొడిగించినా..విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చని విద్యశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో మే నెలాఖరు వరకు వైరస్ అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం తీసుకోవాల్సిన దానిపై విద్యా శాఖ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు టాక్. పాఠశాలలు ప్రారంభమైనా.. నిబంధనలు కంటిన్యూ అవుతాయని డైరక్టర్ బి. శేషుకుమారి వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు  తీసుకోవడం జరుగుతాయని, తరగతి గదుల్లో ఎంతమంది ఉండాలనే దానిపై కసరత్తు జరుపుతున్నామన్నారు. తరగతి గదిలో 20కి మించి విద్యార్థులు ఉండాకుండా చూడాలని, రోజులో పని గంటల్లో మార్పులు ?  రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలా ? అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల కొరత వేధిస్తోంది. ఈ కారణంగా...రొటేషన్ పద్ధతి మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత.. టెన్త్‌ పరీక్షలపై ఓ నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. లాక్‌డౌన్‌ పొడిగిస్తే విద్యా క్యాలెండర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో సైతం సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించనుంది.

Related Posts