YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎల్జీ కంపెనీ ముందు స్థానికుల ధర్నా

ఎల్జీ కంపెనీ ముందు స్థానికుల ధర్నా

ఎల్జీ కంపెనీ ముందు స్థానికుల ధర్నా
విశాఖపట్నం మే 09
విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఎల్జీ పాలిమర్స్‌ ను అక్కడి నుంచి తరలించాలని నినాదాలు చేస్తూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు. కంపెనీతో కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు వెంకటాపురం గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అక్కడ్నుంచి తరలించారు. ఓ వైపు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. పరిశ్రమకు సమీపంలోని వెంకటాపురం గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువకులను అరెస్టు చేసే క్రమంలో వారు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్‌ను మూసివేయడమే సమస్యకు తక్షణ పరిష్కారమని వెంకటాపురం గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం జగన్‌ తమ గ్రామంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. కరోనా భయం వల్ల బంధువులు కూడా ఇంటికి రానివ్వడం లేదని, ప్రమాదం తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.బాధిత ఐదు గ్రామాల్లో గాలిలో ఆక్సిజన్‌ స్థాయి పెంచాలని,ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని, పరిశ్రమను తరలించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వెంకటాపురం గ్రామస్థులు హెచ్చరించారు.

Related Posts