YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

దేశానికే కేసీఆర్ ఆదర్శం

దేశానికే కేసీఆర్ ఆదర్శం

దేశానికే కేసీఆర్ ఆదర్శం
వరంగల్ రూరల్ మే 9
పర్వతగిరి మండలం అన్నారం గ్రామాల్లో కెసిఆర్ చిత్ర పటానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ర్రబెల్లి దయాకర్ రావు పాలాభిషేకం చేసారు. మంత్రి మాట్లాడుతూ  కరోనా ఎఫెక్ట్ కారణంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ఈ తరుణంలో తెలంగాణ సీఎం కెసిఆర్ గారు, అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందరికంటే ముందే లాక్ డౌన్ విధించి దేశానికే ఆదర్శమైన కెసిఆర్, ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వలేదు. నిత్యావసర సరుకులు అందించారు. ధరలను అదుపులో ఉంచారు. 12కిలోల బియ్యం, రూ.1500 ఆర్థిక సాయం...వలస కూలీలను సైతం కన్నబిడ్డల్లా చూసుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, సిఎం కెసిఆర్ దేనని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం చరిత్రాత్మకం. రైతుల పంటలను ఆలస్యమైనా ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక రైతు బంధు పథకం కింద రూ.7వేల కోట్లు, 25 వేల రూపాయల లోపు రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయడానికి 1200 కోట్లు విడుదల చేశారు. ఈ కష్టకాలంలో కూలీలకు ఉపాధి కల్పించడానికి రూ.170 కోట్లు విడుదల చేశారు. లాక్ డౌన్ సమయంలోనే గ్రామ పంచాయతీలకు రూ.370 కోట్లు విడుదల చేశారు. ఆర్థిక మాంద్యంతోపాటు, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, సిఎం కెసిఆర్ ప్రజావసరాలను, అత్యవసరాలకు ఎక్కడా లోటు రాకుండా అన్నిజాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే 25వేల లోపు రుణాలున్న రైతులకు ఆ రుణాలన్నీ మాఫీ అవుతాయి. అధికారులు అదే పనిలో ఉన్నారు. జూన్ నుంచే రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో  జమ అవుతాయి. మరోవైపు వచ్చే వానాకాలం కోసం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధ పరిచారు ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నీటినే కాకుండా, దేవాదుల ప్రాజెక్టు ద్వారా మరింత సాగు, మంచినీటిని ఇవ్వడానికి చర్యలు మొదలు పెట్టారు. మన ప్రాంతంలో మరిన్ని రిజర్వాయర్లు రానున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ప్రారంభించి, త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు ఇంతగా మేలు చేసిన సీఎం చరిత్రలో గతంలో ఎప్పడూ చూడలేదు. నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలోనూ అనేక మంది సీఎంలను చూశాను. కానీ, కెసిఆర్ లాంటి సీఎంని నేను చూడలేదు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్ళకి సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే జవాబని అన్నారు. కెసిఆర్, తెలంగాణని దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపారు. అభివృద్ధిని సైతం ఉద్యమ స్ఫూర్తితో నిర్వర్తిస్తున్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో ముందుంది. పార్టీ శ్రేణులు సైతం సైనికుల్లా ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారథులుగా పని చేస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలేట్లు లేదు. అందుకే ప్రజలు లాక్ డౌన్ పాటించాలి. ప్రభుత్వానికి సహకరించాలి. ముందుముందు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. మన సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ, మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలని మంత్రి అన్నారు.
 

Related Posts