కరోన లాక్ డౌన్ దెబ్బకు..
రేట్లు పెంచిన ప్రైవేటు హాస్పిటల్స్....
ఒంగోలు మే 9
ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిన చందంగా కరోనా రాక ప్రకాశం జిల్లా ప్రజల పీక మీదకొచ్చింది. ఎక్కడ లేని విధంగా ఈ జిల్లాలో కరోనా వచ్చి హాస్పటల్ లను ముసినందువల్ల తమకు చాలా నష్టం వచ్చినందుకు ఒ పి ఫీజ్ ను పెంచివేస్తున్నారు ప్రైవేటు ఆసుపత్రి యజమానులు. 40 రోజులు పాటు తమ హాస్పిటల్ మూసివేసినదుకు ప్రతిగా ఒంగోలు లో అన్ని ప్రయివేట్ హాస్పిటల్స్ ఓనర్లు నస్ఠనివారణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఒంగోలు హాస్పిటల్ రోడ్ లోని కొన్ని హాస్పిటల్ ఓపి ఫీజు ఏకంగా 200 నుంచి 450 కు పెంచారు. అలాగే 500 ఇచ్చిన వాళ్ళు చిల్లర 50 అడిగితే చేతిలో ఒక 10 రూపాయలు విలువ చేసే చిన్న సానిటీజర్ బాటిల్ చేతిలో పెట్టి పంపుతూ న్నారు. దీంతోపాటు టెస్టింగ్ లాబ్స్ లు కూడా 100% టెస్టింగ్ ఫీజులు పెంచారు. అదేమిటి అని అడిగితే 40 రోజుల పాటు మూసివేశాం. మాకు అద్దె డబ్బులు, స్టాఫ్ఙ్ జీతాలు ఎలా అని ప్రశ్నిస్తున్నారు.