YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరోనా కట్టడికి ప్రజలు అధికారులకు సహకరించాలి

కరోనా కట్టడికి ప్రజలు అధికారులకు సహకరించాలి

కరోనా కట్టడికి ప్రజలు అధికారులకు సహకరించాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాష
కడప, మే 9
- కరోనా కట్టడికి ప్రజలు అధికారులకు సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాష పేర్కొన్నారు.  శనివారం ఉప ముఖ్యమంత్రి నివాసంలో ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా అక్కడి సిబ్బందికి 40వ డివిజన్ ఇంచార్జి ఆల్ ఫోన్స్ ఆధ్వర్యంలో  శానిటైజర్లు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం సామాజిక దూరం పాటించి ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు వెంటనే ప్రభుత్వం నిర్వహించే ఉచిత కరోనా వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు.40వ డివిజన్ ఇంచార్జి ఆల్ ఫోన్స్ ఇదివరకే మరియాపురం, భవాని నగర్ లో 3500 కుటుంబాలకు శానిటై జర్లు అందజేశారన్నారు. నేడు డిఎస్పి కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలలో ని సిబ్బందికి శానిటైజర్ లు అందజేయడం శుభపరిణామమన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఎవరు కూడా బయటకు రాకూడదన్నారు. ఈ కార్యక్రమంలో 31 వ డివిజన్ ఇంచార్జి అజ్మతుల్లా మున్సిపల్ సర్వేయర్ జోసెఫ్, వైఎస్ఆర్ సీపీ నాయకులు భాస్కర్, చిట్టి బాబు, తదితరులు పాల్గొన్నారు

Related Posts