YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజీలేని పోరాటం చేయాలి: శ్రీధర్‌బాబు

రాజీలేని పోరాటం చేయాలి: శ్రీధర్‌బాబు

రాజీలేని పోరాటం చేయాలి: శ్రీధర్‌బాబు
హైదరాబాద్
విద్యుత్ సంస్కరణల విషయంలో రాష్ట్రాల హక్కులను లాక్కునే ప్రయత్నాన్ని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఖందించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో  రాజీలేని పోరాటం చేయాలని శ్రీధర్‌బాబు పిలుపు నిచ్చారు.రాష్ట్రంలో ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ఇసుక తరలింపు కోసం పనిచేసేవారికి ఎలాంటి టెస్టులు నిర్వహించడం లేదన్నారు. తెలంగాణకు ఆదాయం వచ్చే వాటిలో చిన్న,సన్నకారు వ్యాపారుల పాత్ర కూడా కీలకమన్నారు. కేంద్రం కోటి 70 వేల కోట్లు ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకుందని.. దేశంలో ఇంతటి పరిస్థితుల్లో ఫైనాన్సిల్ ప్యాకేజి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందన్నారు. సింగపూర్, మలేషియా లాంటి చిన్న దేశాలు కూడా వారి  ప్రజలకు నమ్మకం కల్పించాయన్నారు. దేశంలో ప్రతి పేద కుటుంబానికి 7,500 నగదు ఇవ్వాలనే రాహుల్ గాంధీ సూచనను పక్కన పెట్టారని మండిపడ్డారు. రాబోయే రెండు వారాల్లో కరోనా వ్యాప్తి మరింత వేగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Related Posts