YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కంటి ద్వారా కరోనా

కంటి ద్వారా కరోనా

కంటి ద్వారా కరోనా
న్యూఢిల్లీ, మే 9
కరోనా వైరస్ కేవలం బాధితుడు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర్ల వల్లే వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు అధ్యయనాలు సహా వైద్య నిపుణులు వెల్లడించారు. దీంతో మహమ్మారి సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. తద్వారా ఇతరుల నుంచి ముక్కు, నోటి ద్వారా తమకు వైరస్ సోకకుండా జగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని హాంకాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కళ్లపై ఉన్న కంజుంక్టివా అనే సన్నని పొరపై కరోనా వైరస్ దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.సార్స్ వైరస్ కంటే 100 రెట్లు వేగంగా కరనా వైరస్ దాడి చేస్తున్నట్టు పరిశోధనలు వెల్లడయ్యింది. ఓ అధ్యయనం ప్రకారం.. మనిషి ప్రతి గంటకు 16 సార్లు కంటిని తాకుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో, కంటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుందనే హాంకాంగ్ పరిశోధకులు నివేదిక ఆందోళన కలిగిస్తోంది.హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన పబ్లిక్ హెల్త్ విభాగం ఈ అధ్యయనం చేపట్టింది. కరోనా వైరస్‌ నోరు, ముక్కుతోపాటు కళ్ల ద్వారా శరీరంలో ప్రవేశిస్తుందని ప్రపంచంలోనే తొలిసారిగా ఈ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలను లాన్సెంట్ రెస్పిరేటరీ మెడిసిన్‌లో ప్రచురించారు. డాక్టర్ మైఖేల్ చన్ చి-వాయి నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించిందిసార్స్-కోవ్-2 అధ్యయనంలో భాగంగా మానవ శ్వాసకోశ, కళ్ల నుంచి కణజాలాలను సేకరించి, పరీక్షించాం.. వాటిని సార్స్, హెచ్1ఎన్‌1తో పోల్చిచూశాం. శ్వాసకోశ వాయు నాళాల కంటే కంటిలోని కంజుంక్టివా ద్వారా వేగంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించినట్టు గుర్తించాం.. దీని స్థాయి 80 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉందని డాక్టర్ చన్ అన్నారు. దీని ద్వారా కళ్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని తెలిసిందన్నారు. కాబట్టి, ప్రజలు తమ కళ్లను తాకకుండా ఉండాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.స్టెయిన్‌లెస్ స్టీల్‌పై కరోనా వారం రోజులుపాటు ఉంటుందని గతంలోనే హాంకాంగ్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు, కరోనా కట్టడిలో హాంకాంగ్ విజయం సాధించింది. చైనాలో వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలోనే అక్కడ నియంత్రణ చర్యలు ప్రారంభించింది. దీంతో పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి. రష్యా, ఐరోపా, అమెరికాల్లో రోజూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదువుతున్నా అక్కడ మాత్రం నిలకడగా ఉంది.

Related Posts