YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వైద్య బృందానికి ధన్యవాదాలు

వైద్య బృందానికి ధన్యవాదాలు
 

వైద్య బృందానికి ధన్యవాదాలు
హైదరాబాద్ మే 9
ఆపదలో ఆపన్నహస్తం అందించేది ప్రభుత్వమే అని మరో మారు తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందని, ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించడంలో విజయవంతం అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గత రెండు నెలలుగా నిద్రాహారాలు మాని కరోనా వైరస్ వ్యాప్తి ని అడ్డుకట్ట వేయడంలో, పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ లు నర్సులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికీ మంత్రి ఈటల ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషి వల్లనే తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. అలా అని ఏ ఒక్కరూ రిలాక్స్ అవ్వవద్దని సూచించారు. నిన్నటి వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కోవిడ్ మీద పని చేసిందని, కానీ ప్రస్తుతం లాక్ డౌన్ నిబందన సడలించడంతో మిగిలన డిపార్ట్మెంట్లు అన్నీ వారి వారి పనుల్లో మునిగిపోతారు..  కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ మీద భారం పెరుగుతుంది అని మంత్రి అన్నారు. ఆశ వర్కర్ నుండి టెర్షరీ కేర్ వరకు ప్రతి ఒక్క ఉద్యోగి సెలవులు లేకుండా నిబద్దతతో మరి కొద్ది రోజులు పనిచేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అందరూ వ్యక్తిగత శ్రద్ద తీసుకోవాలని వ్యాధుల భారీనా పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కి మాస్క్ లు, శానిటాయిజర్లు, క్లోరోక్విన్ టాబ్లెట్స్అందించామని విధిగా వాటిని వాడాలని  కోరారు మంత్రి ఈటల. డాక్టర్లది పవిత్రమైన వృత్తి అని, భయపడకుండా వైద్యం అందిచాలని కోరారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి సూచనలతో వైద్య ఆరోగ్యశాఖను మరింత బలోపేతం చేస్తామని  హామీ ఇచ్చారు.     ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు కాబట్టి  కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడం,లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేయించడం, గర్భిణీ స్త్రీలు, ముసలివారు, ఇతర ఆరోగ్యసమస్యలతో బాధ పడుతున్న వారిపట్ల తీసుకోవాల్సిన శ్రద్ద, వాక్సినేషన్, ఇంటింటికీ జ్వరం పరీక్షలు,ధీర్ఘ కాళిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారికి మందుల పంపిణీ, మాస్కు ల పంపిణీ, సర్వేలెన్స్ అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా,వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రజా వైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు,రాష్ట్ర వైద్య మౌళిక సదుపాయాల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక ఆశ వర్కర్ లేదా ఏ.ఎన్.యం ఏర్పాటు చేశామని ఒక్కరికి వంద ఇళ్ళ (హౌస్ హోల్డ్) భాద్యత అప్పగించామని అధికారులు మంత్రికి తెలియజేశారు. వీరందరూ రోజు వారికి కేటాయించిన ఇళ్లను సందర్శించి థెర్మో స్కానర్ ద్వారా ప్రతి ఒక్కరి ఉష్ణోగ్రత పరీక్ష చేస్తారు. కరోనా వ్యాది లక్షణాలు ఉన్నాయా లేదా పరిశీలించి ఉంటే వారికి పరీక్షలు చేయిస్తారని మంత్రికి వివరించారు. వీరందరూ సరిగా పని చేసేలా చూసుకోవాల్సిన భాద్యత జిల్లా అధికారులదేనని వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఆదేశించారు. గర్భణీ స్త్రీలు కంటైన్మెంట్ ప్రాంతంలో ఉంటే కరోనా పరీక్షలు చేయాలని మంత్రి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వస్తే పరీక్షల కోసం తిప్పి ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఈ సందర్భంగా గద్వాల గర్భిణీ మరణించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా చూసుకోవాలని కోరారు. సాధ్యమైనంత మేరకు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివారీల సంఖ్య పెంచాలని సూచించారు. కరోనా వల్ల వాక్సిన్ వేసే శాతం తగ్గింది అని ఈ నెలాఖరులోగా వంద శాతం వాక్సిన్లు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.   ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ కొత్త నిబందనలు జారీ చేసింది అని వీటి ప్రకారం పరీక్షలు చేసే వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది అని మంత్రి అన్నారు. తక్కువ లక్షణాలు ఉన్న వారికి ఇంటివద్దే ఉంచి చికిత్స అందించాలని కొత్త మార్గదర్శకాలు చెప్తున్నాయని అవి అమలు చేస్తే గాంధీ ఆసుపత్రిలో ఉండే వారి సంఖ్య  మరింత తగ్గిపోతుంది  అన్నారు,. అయితే అదే సమయంలో క్షేత్ర స్థాయిలో పని చేసే వారి మీద మరింత భారంపడనుంది అన్నారు. బాగా పని చేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తిస్తుంది అని, అదేసమయంలో  పని చేయకుండా టైమ్ పాస్ చేసేవారికి డిపార్ట్మెంట్ లో స్థానం ఉండదు అని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం డాక్టర్లంటే సమాజంలో గౌరవం బాగా పెరిగిందని దానిని నిలబెట్టుకోవాలని కోరారు. సేవ చేసే అదృష్టం అందరికీ రాదు అని అన్నారు. బ్రిటన్ ప్రధాని లాంటి వారే దేవుడు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇచ్చారని చెప్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ప్రతి నిమిషం డిపార్ట్మెంట్ మీద  సమీక్షిస్తున్న తరుణంలో మరింత నిబద్దతో పని చేసి, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి కోరారు.

Related Posts