YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

కిలో వందకు చేరిన బంగినపల్లి

 కిలో వందకు చేరిన బంగినపల్లి

మధుర ఫలాలుగా పేరొందిన మామిడి పండ్లు మామూలుగా ఏప్రిల్‌ మొదటి వారం నుంచి విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సారి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పూత, కాత నెల రోజులు ఆలస్యంగా రావడంతో ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు. మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలుపుతున్నాయి.కాగా హైదరాబాద్, విజయవాడల నుంచి కొందరు చిరు వ్యాపారులు దొరికిన కొద్దిపాటి బంగినపల్లి మామిడి పండ్లను తీసుకొచ్చి కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్ముతున్నారు. ఈ మామిడి పండ్లు ప్రస్తుతం కాశిబుగ్గ చౌరస్తాతో పాటు అండర్‌బ్రిడ్జి, ములుగురోడ్డు సెంటర్‌లో లభ్యమవుతున్నాయి.ఈ యేడాది పండ్ల తోటల ద్వారా దిగుబడి బాగా పెరిగిపోగా ఇతర రాష్ర్టాల నుంచి కూడా భారీగా మామిడి పండ్లు దిగుమతి అవుతుండ డంతో ధరలు పడిపోయాయి. గతేడాది బంగిన పల్లి రకం కిలోకు 80 నుంచి 100 రూపాయల వరకు విక్రయించగా ఈ యేడాది ఇప్పటికే మరింత పెరిగింది. జిల్లాలో రెండు వేల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి. ఐదారేళ్ల నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి కాలం కలిసి వచ్చి పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. గతంతో పొల్చితే పూత, పిందెలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. దీంతో హెక్టారుకు గరిష్టంగా ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. సాధారణం కంటే ఒక టన్ను దిగుబడి అధికంగానే ఉంది. అయితే, ఆ ఆనందం కూడా రైతులకు మిగలడం లేదు. ప్రకృతి కరుణించడంతో పంట నష్టాల బారి నుంచి బయటపడ్డట్టే అని రైతులు భావించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ధర వద్దకు రాగానే దిగులు పడ్డారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు.  సీజన్‌ ఆరంభంలో వచ్చిన మామిడి పళ్లను చూసి వినియోగదారులు కొనడానికి ఎగబడుతున్నారు.మందుగా అమ్మకానికి వచ్చే కోబ్రా, నీలంబరి, జలాలు, నీలాలు కూడా ఇప్పటి వరకు అమ్మకానికి రాలేదు. ఒక బంగినపల్లి మాత్రం అక్కడక్కడ అమ్మకానికి ఉండడం విశేషం.కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి.

Related Posts