YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో ఆగని కరోనా మృత్యు విలయం .. 24గంటల్లో 1568మంది మృతి

అమెరికాలో ఆగని కరోనా మృత్యు  విలయం  .. 24గంటల్లో 1568మంది మృతి

అమెరికాలో ఆగని కరోనా మృత్యు  విలయం  .. 24గంటల్లో 1568మంది మృతి
అమెరికాలో కరోనా వైరస్ ఆగడం లేదు. మరణాల సంఖ్య కూడా తగ్గడం లేదు. తాజాగా మరో 1568 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్యఅమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1,568 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 78,746కు పెరిగినట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. మరోవైపు అమెరికాలో ఇప్పటివరకు 13,09,164 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు మూడున్నర లక్షల కేసులు ఒక్క న్యూయార్క్‌లోనే నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 26,771 మంది న్యూయార్క్‌లో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల విషయంలో న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీ ఉంది. న్యూయార్క్ తర్వాత అత్యధిక కేసులు నమోదైంది ఇక్కడే. ఇప్పటి వరకు ఇక్కడ 1,38,579 కేసులు నమోదు కాగా, 9,118 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related Posts