YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీ గల్లీగల్లీలో..చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనా వైరస్‌

ఢిల్లీ గల్లీగల్లీలో..చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనా వైరస్‌

ఢిల్లీ గల్లీగల్లీలో..చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనా వైరస్‌
ఢిల్లీ మే 10 :దేశ రాజధాని ఢిల్లీలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. వారం రోజుల్లోనే రోగుల సంఖ్య 41 శాతం పెరిగింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని, పరిస్థితిని అదుపులోకి తీసుకురాకుంటే అంతర్జాతీయ చర్చకు తావిస్తుందని భావిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఆందోళనకర స్థితి నెలకొన్న 20 జిల్లాల్లో ఢిల్లీ (మధ్య, నైరుతి, ఉత్తర ఢిల్లీ)వే మూడు ఉండటం గమనార్హం. రెండు వారాల్లో మధ్య, ఉత్తర ఢిల్లీలో కేసులు అనుకున్న దానికంటే వేగంగా రెట్టింపయ్యాయి. దేశవ్యాప్తంగా కేసుల రెట్టింపునకు 12 రోజులు పడుతుంటే.. ఈ ప్రాంతంలో ఆ వ్యవధి 9.5 రోజులే. ఇక మొదటి వెయ్యి కేసులకు 43 రోజులు (ఏప్రిల్‌ 11) పడితే, ఆపై పది రోజుల్లోనే సంఖ్య డబులైంది. తాజాగా 19 రోజుల్లో 5 వేల వరకు కేసులు నమోదయ్యాయి. దాదాపు 1.90 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో పరిణామాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గమనిస్తున్నప్పటికీ గతంలోలా అప్రమత్తమై చర్యలు తీసుకోవడం లేదుదీంతో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో).. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శివిజయ్‌దేవ్‌ ద్వారా నివేదికలు తెప్పించుకుంది. , . ప్రభుత్వ ఆస్పత్రులు నిండిపోవడం, పరీక్షలు జరిపితే మరిన్ని కేసులు బయటపడతాయని భావించడం ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు ఢిల్లీలో మొత్తం 1,106 వెంటిలేటర్లు ఉండగా, అందులో 306 మాత్రమే ప్రభుత్వానివి. 800 ప్రైవేట్‌ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి. పడకలు చాలకపోవడంతో ఇప్పటికే 12 ప్రైవేట్‌ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులను ప్రభుత్వం వాడుకుంటోంది. శనివారం మరో నాలుగింటిని చికిత్సకు కేటాయించింది.

 

 

Related Posts