YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి దేశీయం విదేశీయం

హెచ్‌-1బీ వీసాలపై తాత్కాలికంగా వేటు

హెచ్‌-1బీ వీసాలపై తాత్కాలికంగా వేటు

హెచ్‌-1బీ వీసాలపై తాత్కాలికంగా వేటు
వాషింగ్టన్‌, మే 10 . కరోనా వైరస్‌ దెబ్బతో అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆర్థిక కార్యకలాపా లు ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో అనేక మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.  అయితే కరోనాతో యూఎ్‌సలో పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయి నిరుద్యోగం పెరుగుతోంది.హెచ్‌-1బీ వీసాలపై తాత్కాలికంగా వేటు వేసే ఆలోచనలో అమెరికా. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోండంతో కొన్ని పని ఆధారిత వీసాల జారీని తాత్కాలికంగా నిషేధించాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. వీటిలో హెచ్‌-1బీ, స్టూడెంట్‌ వీసాలు కూడా ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. హెచ్‌-1బీ వీసాల ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను నియమించుకుంటున్నాయి. భారత్‌, చైనా తదితర దేశాల నిపుణులు ఈ వీసాల ద్వారానే అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఒకవేళ హెచ్‌-1బీ వీసాలను తాత్కాలికంగా నిషేధిస్తే భారతీయుల అమెరికా ఆశలు గల్లంతుకానున్నాయి. హెచ్‌-1బీ వీసాలపై 5 లక్షల మంది వలస కార్మికులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పని ఆధారిత వీసాలను తాత్కాలికంగా నిషేధించాలని అమెరికా అధ్యక్షుడి వద్దనున్న ఇమ్మిగ్రెంట్‌ సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఈ నెలలోనే వెలువడవచ్చని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

Related Posts