YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అప్పడు నీటి కష్టాలు

అప్పడు నీటి కష్టాలు

ఆదిలాబాద్ జిల్లా,కుమ్రంబీం జిల్లా ప్రాంతాల్లోని ఏజెన్సీ ప్రజలు తాగు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎండకాలం ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగేందుకు నీళ్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భజలాలు  అడుగంటిపోవయడంతో బోర్లు  ఉన్నా ఫలితం లేకపోతున్నాయి. చుక్క నీటి కోసం కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతూ ఉండటంతో రాష్ట్రంలో మంచి నీటి సమన్య ఎక్కువ అవుతోంది. అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌ ఇలా కనీస వసతులకు నోచుకోలేక ఆదివాసీలు పడరాని పాట్లు పడుతున్నారు. వీరిని కేవలం జనాభా లెక్కలు, ఓట్ల కోసమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటినా వీరి తలరాతలు ఇంకా మారలేదు. వాజేడు మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలో ఉన్న ఓ కుగ్రామం పెనుగోలు. వాజేడు నుంచి ఈ గ్రామం 18 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే రాళ్ల దారిని దాటాల్సిందే.. ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. ఇక్కడ గతంలో 50 కుటుంబాలు, 200 మంది జనాభా ఉండేది. గుట్టలు దిగిరావాలని అధికారులు పెట్టిన ఒత్తిడి కారణంగా తమ స్వేచ్ఛా జీవితాన్ని వదిలి 25 కుటుంబాల వారు వాజేడు సమీపంలోకి వచ్చి నివాసముంటున్నారు. మిగిలినవారు పెనుగోలులోనే అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్నారు.  పెనుగోలుకు వెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో రాళ్ల దారిలో వాగులను దాటాల్సి ఉంటుంది. గ్రామస్తులు రేషన్‌ సరుకులు తీసుకోవడానికి సైతం గుమ్మడి దొడ్డికి రావాల్సి ఉంటుంది. ఏ పనికైనా గుట్టలు దిగి రాళ్ల దారి, చెట్లు పుట్టలు, వాగులు వంకలు దాటుకుంటూ రావాల్సిందే..ముఖ్యంగా ఏజేన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.నీటి కటకటతో అల్లాడిపోతున్నాయి. బోర్లు ఎండిపోవడంతో గ్రామాలకు రెండు,మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగులను ఆశ్రయిస్తున్నారు. ఉదయం లేవగానే బ్లండ్లు కట్టుకుని చిన్నా పెద్ద , మహిళలు అంతా తాగు నీటి కోసం  బాట పడుతున్నారు. వాగులో  చెలిమలు చేసి ఊరే నీటి ఊటను చిన్న పాత్రలతో తోడుకుని బిందెల్లో నింపుకుంటున్నారు. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో ఉండే గురుకుల పాఠశాల విద్యార్థుల కష్టాలు అంతా ఇంతా కాదు. తాగు నీటి కోసం వాగులు, వంకల బాట పడుతున్నారు.

Related Posts