YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సైన్యం లో చాపకింద నీరులా కరోనా మరో 62 మంది CRPF జవాన్లకు కరోనా...

 సైన్యం లో చాపకింద నీరులా కరోనా మరో 62 మంది CRPF జవాన్లకు కరోనా...

 సైన్యం లో చాపకింద నీరులా కరోనా మరో 62 మంది CRPF జవాన్లకు కరోనా...
ఢిల్లీ
మే 10.    సైన్యం లో చాపకింద నీరులా కరోనా మరో 62 మంది CRPF జవాన్లకు కరోనా...సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో మరో 62 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా మొత్తం కరోనా ఉన్న CRPF జవాన్ల సంఖ్య 234కి చేరింది. వీరిలో ముగ్గురు కరోనా నుంచి కోలుకున్నారు. 231 మంది మాత్రం కరోనాతో బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించి CRPF... అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో... 35 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ ఉందని తేలింది. వారిని కూడా కలిపితే... కరోనా ఉన్న వారి సంఖ్య 250 దాటింది. ఐతే... ఇప్పటివరకూ CRPF, BSF, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ (ITBP), సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ ఫోర్స్ (CISF), శస్త్ర సీమా బల్ (SSB).. అన్ని విభాగాలూ కలిపి... కరోనా పాజిటివ్ వచ్చిన జవాన్ల సంఖ్య 500కు పైనే ఉంది. వారిలో ఐదుగురు ఇప్పటికే చనిపోయారు. సరిహద్దుల్లో కంటికి కనిపించే శత్రువును చీల్చి చెండాడే సైనికులు... కంటికి కనిపించని శత్రువుతో మాత్రం పోరాడలేకపోతున్నారు. ఈ పాజిటివ్ వచ్చిన వారిలో 95 శాతం మంది... ఢిల్లీలో... లా అండ్ ఆర్డర్ సెట్ చెయ్యడానికి మోహరించినవారేనని తెలిసింది. అంటే... రాజధానిలో శాంతి భద్రతల కోసం చేసిన పోరాటంలో... తమ ప్రాణాలు పణంగా పెట్టారన్నమాట. ITBPలో 45 మందికి కరోనా వచ్చింది. వాళ్లంతా ఢిల్లీలో విధులు నిర్వహించినవారే. CRPFలో SDG ర్యాంక్ అధికారికి కరోనా సోకడంతో... ఢిల్లీలోని CRPF ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. సోమవారం BSF ప్రధాన కార్యాలయంలో... రెండు అంతస్తులను మూసివేశారు. అక్కడ ఓ హెడ్ కానిస్టేబుల్‌కి కరోనా సోకింది. అతనితో టచ్‌లో ఉన్న 50 జవాన్లను క్వారంటైన్ చేశారు. వాళ్లలో 20 మందికి టెస్టులు చేశారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది

Related Posts