YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*హనుమ అనుగ్రహం ఇలా లభిస్తుంది*

*హనుమ అనుగ్రహం ఇలా లభిస్తుంది*
*హనుమ అనుగ్రహం ఇలా లభిస్తుంది*

రామాలయం లేని గ్రామం దాదాపు కనిపించదు. అలాగే హనుమంతుడు లేని రామాలయమూ కనిపించదు. ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడనీ, హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు ముందుగా రామచంద్రుడి భక్తులై వుండాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తనని పూజిస్తే మురిసిపోయే హనుమంతుడు .. రామచంద్రుడిని కీర్తిస్తే పరవశించి పోతాడు. అందుకే రాముడితో కలిపి హనుమంతుడిని సేవించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని అంటారు. హనుమంతుడికి మంగళవారం .. శనివారం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ రోజుల్లో ఆయనకి ప్రదక్షిణలు చేయాలి. సిందూర అభిషేకం .. ఆకుపూజ చేయించాలి. వడలు .. తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. 'హనుమజ్జయంతి' రోజున ఇలా చేయడం మరింత విశేషమైనదనేది మహర్షుల మాట. ఈ రోజున 'సుందరకాండ' పారాయణం .. 'హనుమాన్ చాలీసా' చదువుకోవడం .. నామ సంకీర్తనం చేయడం వలన, హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయురారోగ్యాలు .. సిరి సంపదలను అనుగ్రహిస్తాడు.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts