YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

"మంచిని కోరడం"

"మంచిని కోరడం"
"మంచిని కోరడం"

ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి. వాళ్ళ బుద్ది బాగుపడాలి , వాళ్ళు బావుండాలి అని కోరుకోండి. ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది. అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.   ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం. ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది. చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది. సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా .. కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి. అందుకే కదా. రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు. యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు. మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది ఒక తపస్సు లాగా చేయాలి.
లోకా సమస్తా సుఖినో భవంతు

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts