బీజేపీ ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదని, ఏపీకి హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని బీజేపీ నేత పురందేశ్వరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో బీజేపీపై టీడీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. భూగర్బ డ్రైనేజీకి ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదని, ఏపీలో ఎవరు ఏంటో ప్రజలు బేరిజు వేసుకుంటారని పురందేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయదని పురందేశ్వరి అన్నారు. ఏపీలో భూగర్భ డ్రైనేజీకి ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆమె మాట్లాడుతూ, హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని అభిప్రాయపడ్డారు.