భాద్యతలు - భగవంతుడు
మోయలేని సంసార భారంతో నిరంతరం సతమతమవుతున్నాము కదా!
మరేమి పరవాలేదు, వీటిని మోయడానికి భగవంతుడు ఉన్నాడు,
అయితే దీనికి మనం చేయవలసిదల్లా గుండెలో భారాన్ని తీసి భగవంతునికి దండ గా అర్పించడమే! ...
రైలులో ప్రయాణం చేసేవాడు తన లగేజీని నెత్తిమీద పెట్టుకుని మోస్తాడా?
లేదుకదా!
పక్కనో లేదా కిందినో పెట్టి నిశ్చింతగా, తేలికగా , ప్రశాంతంగా కూర్చుంటాడు.
తనను మోసే రైలు తన లగేజీని మోయలేదా! అన్న ధీమాతోనే కదా! అలాగే ఈ సమస్త సృష్టి భారం మోస్తున్నవాడు మన ఒక్కరి భారం మోయలేడా?!
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో
మన బరువు బాధ్యతలు భగవంతునికి వదిలేయడం, మంచిది...
మనసు నిండుగా భగవంతునిపై చెదరని, బెదరని స్థిరమైన విశ్వాసం ఉంచడం మంచిది...
ఫలితాలు పట్ల శోకించి, కాలం వ్యర్థం చేసుకోవడం మంచిది కాదు, భారము తప్పక తగ్గి మనశ్శాంతి పరిమళిస్తుంది.
దైవమును నమ్మక చెడినవాడు ఉన్నాడు కానీ నమ్మి చెడినవాడు ఏ కాలమునందునూ లేడు, ఉండడు అన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి...
*శుభమస్తు*
సమస్త లోకా సుఖినోభవంతు