YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మామిడి ప్రాణాంతకమైన రసాయనాలు

మామిడి ప్రాణాంతకమైన రసాయనాలు

మామిడి ప్రాణాంతకమైన రసాయనాలు  
శ్రీకాకుళం, మే 12,
 ఏటా మార్చి నుంచి జూన్‌ నెల చివరి వరకు మామిడి కాయల సీజన్‌ కావడంతో ఎంత ధర చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకాడరు. ఆ బలహీనతనే అవకాశంగా తీసుకున్న  వ్యాపారులు కాయలు మగ్గించేందకు నిషేధిత విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. పక్వానికి రాకుండానే కోసేసి వాటిపై ప్రాణాంతకమైన ఎపికాన్, పోపాన్‌ వంటి రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. కరోనాతో అధికారులు ఇతర పనుల మీద ఉండడంతో  వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ స్ప్రే చేసిన మామిడి కాయలను 24 గంటల్లోగా ప్యాకింగ్‌ చేసి  ఎగుమతి చేయకపోతే పాడవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. వాస్తవానికి పక్వానికి వచ్చిన మామిడి కాయలను కోసి ఎండుగడ్డిలో వారం రోజులపాటు కావు వేస్తే అవి మగ్గుతాయి. మధుర ఫలం మామిడిని ప్రాణాంతక రసాయనాలతో మగ్గించి విక్రయిస్తున్న నాలుగు యార్డులపై విజిలెన్స్‌ అధికారులు  ఆకస్మిక దాడులు నిర్వహించారు. చినదొడ్డిగల్లు సమీపంలో దుర్గా  మ్యాంగో సప్లయిర్స్, వీజీఆర్‌ ఫ్రూట్స్, వీఈఆర్‌ అండ్‌ కో, వెంకట దుర్గా ఫ్రూట్స్‌ నిర్వాహకులు ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేస్తున్న విషయం అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కంట్రోలర్‌ తదితర అధికారులు కూడా మామిడి యార్డుల వద్దకు చేరుకున్నారు. స్ప్రే చేసిన మామిడి కాయల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నట్లు చెప్పారు. ఇలా కృత్రిమంగా మగ్గించిన బంగినపల్లి టన్ను రూ.35 నుంచి రూ.37 వేలకు, సువర్ణరేఖ టన్ను రూ.33 వేలకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 15 యార్డుల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే పది వేల టన్నుల మామిడి పండ్లు ఇతర రాస్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇవన్నీ ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేసి మగ్గించినవే కావడం విశేషం.. ప్రజల ప్రాణాలు హరించే ప్రమాదకర రసాయనాలు వినియోగించడం నేరమని ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. సుమారు రూ.8 లక్షల విలువ చేసే 25 టన్నుల మామిడి కాయలు స్వాధీనం చేసుకున్నామని... వీటిని విక్రయించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డుల్లో స్ప్రే చేసేందుకు సిద్ధంగా ఉంచిన రసాయనాల డబ్బాలు, స్రేయర్లను కూడా పరిశీలించారు.నక్కపల్లి మండంలలో వేంపాడు టోల్‌గేట్‌ పరిసరాల్లో సుమారు 15 మామిడి యార్డులు (కమీషన్‌ దుకాణాలు)ఉన్నాయి. ఇక్కడి వ్యాపారులు  పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి పశ్చిమబెంగాల్, బీహార్, కలకత్తా, హైదరాబాద్, భువనేశ్వర్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కటక్, ముంబయి తదిర పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. రోజూ సుమారు 100 టన్నులకు పైగా వివిధ  రకాల మామిడి పండ్లు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు

Related Posts