YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్రం మెడలు వొంచుతాం : ఎంపీలు

 కేంద్రం మెడలు వొంచుతాం : ఎంపీలు

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా పార్లమెంటులో సుమారు నెల రోజుల పాటు తమ నిరసన తెలిపామని టీడీపీ ఎంపీలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధిస్తోందని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిలో టీడీపీ ఎంపీలు శనివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ... మా ఆందోళనను కేంద్రం పట్టించుకోలేదని, అమిత్‌షా వ్యాఖ్యలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. పార్లమెంట్‌ సభ్యులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంపట్ల బీజేపీకి గౌరవం లేదన్నారు. అలాగే చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ మాట్లాడుతున్నారని, ఏపీ హక్కులు కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు పేర్కొన్నారు.దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై మండిపడుతున్నాయని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే చాలా బాధేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల బీజేపీకి ఏ పాటి గౌరవం ఉందో అర్థమవుతోందని అన్నారు.మరోవైపు వైసీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీలు అన్నారు. అప్పట్లో ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎలా సాధించుకుంటామని జగన్ అన్నారని, ఇప్పుడు రాజీనామా చేశారని విమర్శించారు. వైసీపీ నేతలు నీతులు చెబుతోంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని అన్నారు.అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇస్తే ఎందుకు చర్చ జరపలేదని స్పీకర్‌ను అడిగామని టీడీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. మోడీ డైరెక్టర్‌లో జగన్ యాక్షన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఏపీ హక్కులను కాపాడుకుంటామని చెప్పారు. 

Related Posts