YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేజీహెచ్ సెంటిమెంట్ జగన్ వర్కౌవుటుందా...

కేజీహెచ్ సెంటిమెంట్ జగన్ వర్కౌవుటుందా...

కేజీహెచ్ సెంటిమెంట్ జగన్ వర్కౌవుటుందా...
విశాఖపట్టణం, మే 11
జగన్ కి ఎన్టీఆర్ కి చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరికీ లౌక్యం పాళ్ళు తక్కువ. అదే విధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలనుకుంటారు. పేదల పట్ల, ప్రజల పట్ల ఎక్కువగా బాధ్యత పడతారు. తాము అనుకున్నది సాగాలనుకుంటారు. ఈ విషయంలో రూల్స్, రెగ్యులేషన్లను పెద్దగా పట్టించుకోరు. దాని వల్ల సమస్యలు వచ్చినా కూడా ఎక్కడా వెనక్కు తగ్గరు, వెరవరు, ఇక వ్యూహాలు, ఎత్తుగడల్లో కూడా ఇద్దరూ బలహీనులే. తమకు జనం బలం ఉందని అతి విశ్వాసంగా ఉంటారు. ఇక జగన్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా ఆ వాసనలు తక్కువ. ఎన్టీఆర్ సినీ సీమ నుంచి వచ్చినా ముక్కుసూటిగా ఉంటారు. ఇద్దరూ ఓటమిని అంగీకరించే తత్వాలు కాదు, జనంలోనే దేన్ని అయినా తేల్చుకునే ఘటాలు. ఇద్దరికీ జనం మద్దతు పుష్కలంగా ఉంది. అందుకే చరిత్రను తిరగేసే రికార్డులు నెలకొల్పి అధికారంలోకి వచ్చారు.ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ కి సెంటిమెంట్లు ఎక్కువ. ఆయన ప్రతీ దానికీ ముహూర్తాలు చూస్తారు. సెంటిమెంట్లను పట్టించుకుంటారు. ఇక ఎన్టీఆర్ తాను అలా అన్నీ పాటించినా కూడా తానే ఓ యాంటీ సెంటిమెంట్ సింబల్ అవుతాను అని అనుకోలేదు. కానీ అది రాజకీయ జీవులంతా భయపడే యాంటీ సెంటిమెంట్ అయి కూర్చుంది. అదే విశాఖలోని కేజీ హెచ్. ఇక్కడకు చివరి సారిగా వచ్చిన సీఎం ఎన్టీఆర్. ఆయన 1995లో విశాఖ కేజీ హెచ్ ని సీఎం హోదాలో సందర్శించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన ముఖ్యమంత్రి పీఠం కదిలిపోయింది. స్వయంగా అల్లుడే ఆయన్ని గద్దె నుంచి కూలదోసి కొత్త సీఎం అయిపోయారు.ఆ తరువాత నుంచి కేజీ హెచ్ అన్నది యాంటి సెంటిమెంట్ గా ముఖ్యమంత్రులకు మారిపోయింది. ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆయన మూడు సార్లు సీఎంగా చేసినా కేజీ హెచ్ కి వెళ్ళకపోవడం విశేషం. అక్కడికి వెళ్తే పదవికి ముప్పు అని మామ నుంచి నేర్చుకున్న నీతిని తప్పనిసరిగా పాటిస్తూ వచ్చారు. ఇక మరో వైపు చూసుకుంటే వైఎస్సార్ రెండు సార్లు సీఎం అయ్యారు. ఆయన ఆ వైపు పోలేదు. ఇక రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రులుగా ఉమ్మడి ఏపీకి చేసినా కేజీ హెచ్ వైపు రాలేదు. దాని వల్ల వచ్చే అనర్ధాలు భరించలేమని కారణంగానే వెళ్ళలేదని చెబుతారు.ఇక విశాఖ కేజీ హెచ్ కి గత పాతికేళ్ళలో ఏ ముఖ్యమంత్రీ వెళ్లలేదు. కానీ జగన్ మాత్రం వెళ్లారు. పాలీమర్స్ బాధితులను పరామర్శించడానికి ఆయన స్వయంగా కేజీ హెచ్ కి వెళ్ళి గంట సేపు అక్కడే గడిపారు. వారిని ఓదార్చి మరీ వచ్చారు. దీంతో ఇపుడు కొత్త చర్చ మొదలైంది. ఎన్టీఆర్ తో అనేక పోలికలు ఉన్న జగన్ కేజీ హెచ్ కి వెళ్ళి పెద్దాయన బాటలోనే నడిచారని అంటున్నారు. మరి జగన్ కి కూడా పదవీ గండం పొంచి ఉందా అన్న భయం ఇపుడు వైసీపీ పెద్దల్లో ఉంది. అయితే జగన్ ఇలాంటి వాటిని అసలు పట్టించుకోరని, ఆయన ఆపదలో, చావు బతుకుల్లో ఉన్న పేదలను పరామర్శించడానికి వెనకడుగు వేయలేరని అదే పార్టీ వారు చెబుతున్నారు. జగన్ కి పదవులు కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈ యాంటీ సెంటిమెంట్ విషయం ఇపుడు వైసీపీ టీడీపీలో పెద్ద చర్చకు తెరలేపుతోంది. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే జగన్ పదవి పోతుందని టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి జగన్ ఆ యాంటీ సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసి అజేయుడుగా నిలుస్తారా.. కాలమే జవాబు చెప్పాలి.
 

Related Posts