YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ దేశీయం

షాక్ ఇస్తున్న కొత్త కరెంట్ చట్టం

షాక్ ఇస్తున్న కొత్త కరెంట్ చట్టం

షాక్ ఇస్తున్న కొత్త కరెంట్ చట్టం
హైద్రాబాద్, మే 11
కొత్త కరెంటు చట్టం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త చట్టం కారణంగా...రైతులు, ఇతరులపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం -2020 ముసాయిదా బిల్లులో ఎన్నో కీలక అంశాలున్నాయి.ఈ బిల్లు ప్రకారం...గృహ వినియోగదారులు వినియోగించే..ప్రతి యూనిట్ కు పూర్తిస్థాయి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 97.6 లక్షలమంది గృహ వినియోగదారులపై ప్రభావం చూపుతుందని అంచనా. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తున్న వారు సబ్సిడీ పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లు అమల్లోకి వస్తే..సబ్సిడీలు రద్దు కానున్నాయి. సబ్సిడీని పొందుతున్న వారు..భారీ మొత్తంలో బిల్లులు చెల్లించే పరిస్థితి ఏర్పడనుంది. ప్రతి వినియోగదారుడు ముందుగా తాను వినియోగించిన కరెంటుకు ఎంత బిల్లు వస్తే..అంత చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి అర్హుడు అయితే...ఆ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ రూపంలో వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. తాజా బిల్లు ప్రకారం క్రాస్‌ సబ్సిడీ మొత్తాన్ని రద్దు చేయనున్నారని సమాచారం. రాష్ట్రంలో మొత్తం గృహ వినియోగదారులు 1,13,19,524 మంది ఉన్నారు. విద్యుత్‌ను పొందుతున్నవారు లేక సబ్సిడీని అనుభవిస్తున్నవారు 97,60,728 మంది. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ ను వాడే వారు..క్రాస్ సబ్సిడీ, ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 3.30 పైసల చొప్పున, 101-200 యూనిట్ల వరకు రూ. 4.30 పైసల చొప్పున బిల్లు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారు ప్రతినెలా వందల రూపాయల సబ్సిడీని పొందుతున్నారు. కొత్త బిల్లు ప్రకారం.. 190 యూనిట్లు వినియోగిస్తే...యూనిట్ కు రూ. 6.87 చొప్పున లెక్క వేస్తారు. మొత్తం ఇది రూ. 1305.30 పైసలు కానుంది. దీనికి సర్వీస్‌, ఇతర చార్జీలు కలుపుకొంటే...మొత్తం రూ.1366.70గా రానుంది. ఇది వినియోగదారులకు భారమే అని చెప్పవచ్చు. క్రాస్‌ సబ్సిడీ రద్దయి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంతో తెలియకపోతే.. ఆ మొత్తం అదనంగా కట్టాల్సి ఉంటుంది. మొత్తంగా...కొత్త కరెంటు చట్టంతో గృహ వినియోగదారులకు ఇది శాపంగా మారనుంది.

Related Posts