YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ విదేశీయం

ఎల్జీ పాపం...పెద్ద భారం

ఎల్జీ పాపం...పెద్ద భారం

ఎల్జీ పాపం...పెద్ద భారం
విశాఖపట్టణం, మే 11
విశాఖ ఎల్.జి. పరిశ్రమ తరలింపు ఇప్పట్లో సాధ్యమయ్యేనా? తరలింపు ప్రక్రియ అంత సులువుగా జరుగుతుందా? ప్రభుత్వం తరలించమన్నా కంపెనీ యాజమాన్యం అందుకు అంగీకరిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పట్లో లభించే అవకాశం లేదు. 1961లో ప్రారంభమయిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దశల వారీగా చేతులు మారుతూ చివరకు కొరియా కంపెనీ అయిన ఎల్జీ చేతులోకి వచ్చింది. ఈ కంపెనీ విస్తరణకు కూడా 2017లో అప్పటి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎల్జీ కంపెనీకి కేటాయించిన సింహాచలం ఆలయ భూములపూ న్యాయస్థానంలో వివాదాలున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం విస్తరణకు అనుమతివ్వడం ప్రస్తుతం చర్చగా మారింది. అయితే మల్టీ నేషనల్ కంపెనీ కావడంతో కంపెనీని తరలించాలన్నా, మూసివేయాలన్నా కొన్ని నిబంధనలుంటాయి. చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్న పళంగా కంపెనీ తరలిద్దామని ప్రభుత్వం భావించినా సాంకేతికంగా సాధ్యం కాదు.నలభై అయిదు రోజులు లాక్ డౌన్ కారణంగానే సరిగా మెయిన్ టెయిన్ చేయక గ్యాస్ లీకు జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కంపెనీ యాజమాన్యం కూడా పరోక్షంగా అంగీకరిస్తుంది. మరోసారి కంపెనీని మూసివేసినా స్టిరిన్ గ్యాస్ ట్యాంక్ ను మెయిన్ టెయిన్ చేయకపోతే మరోసారి ప్రమాదం తప్పదన్నది వాస్తవం. అలాగే తరలించాలన్నా దానికి చట్ట పరంగా ఎన్నో చర్యలు చేపట్టాలి. ఇదే కంపెనీకి నగరానికి దూరంగా మరో స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది.ఇప్పుడు కంపెనీకి అప్పట్లో కేటాయించిన భూములకు విలువ పెరిగింది. దీంతో కంపెనీని తరలించమని ప్రభుత్వం చెప్పినా అది న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముంది. అందుకే ప్రభుత్వం కూడా అన్ని రకాల నివేదికలు వచ్చిన తర్వాతనే చర్యలకు దిగాలని యోచిస్తుందని చెబుతున్నారు. విపక్షాలు మాత్రం కంపెనీని వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్.జి. పాలిమర్స్ పరిశ్రమను మూసినా ప్రమాదం జరిగే అవకాశముందని, అలాగే తరలించాలన్నా నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నది ప్రభుత్వ వాదనగా ఉంది. స్థానికులు, విపక్షాలు మాత్రం కంపెనీని వెంటనే మూసివేసి ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. కానీ అందుకు చాలా సమయం పడుతుందన్నది నిపుణుల మాటగా విన్పిస్తుంది.

Related Posts