YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

వారిని పట్టించుకోవద్దు

వారిని పట్టించుకోవద్దు

వారిని పట్టించుకోవద్దు
విశాఖపట్నం మే 11
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా కొంత మంది కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని మంత్రులు బొత్ప సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్  ప్రజలకు విజ్పప్తి చేశారు. ఎల్జీ కంపెనీలో గ్యాస్‌ లీకేజీని పూర్తిగా అరికట్టామని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదన్నారు. అక్కడి గాలి, నీరు, మట్టి ఎంత మేర కలుషితమైందనేది పరీక్షలు నిర్వహించామన్నారు. గత తీవ్రత దృష్ట్యా కలుషిత గాలి శాతం తగ్గిందని తెలిపారు. టీడీపీ సర్కారులా తమది ప్రచారాల ప్రభుత్వం కాదని,  ప్రజల ప్రభుత్వమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఎల్‌జీ పాలిమర్స్‌ విస్తరణకు అనుమతులు ఇచ్చారని స్పష్టం చేశారు. ఓ సారి కంపెనీలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు,  కంపెనీని తరలించాలని అప్పుటి పెందుర్తి ఎమ్మెల్యే చంద్రబాబుకు లేఖ రాస్తే కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడు ఇలా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ డ్రామా కంపెనీ ప్రతినిధులు బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన స్క్రీప్ట్‌ను మీడియా ముందు చదివి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేశారని మంత్రి బొత్స ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ప్రమాదం జరిగినా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో కంపెనీ నిర్లక్ష్యం ఉందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కంపెనీని తర లించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని తప్పకుండా రాబడతామని చెప్పారు.

Related Posts