మావోయిస్టు లొంగుబాటు
ములుగు మే 11,
మావోయిస్టు పోలీసులకు లొంగిపోయాడు. బద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన వెట్టి ఐతు (23) పోలీసులకు లొంగియాడని పోలీసులు వెల్లడించారు. 2014 లో ఐతు మావోయిస్ట్ పార్టీ దళం పాటలకు ఆకర్షుతుడై ఆ దళా కమాండర్ సంతోష్ ఆదేశాలు ప్రకారంగా మావోయిస్ట్ పార్టీ లో దళ సభ్యుని గా చేరాడు. అప్పటినుంచి అజ్ఞాత వాసంలోనే వున్నాడు . పార్టి అగ్రనేతలు వద్ద ఉంటూ 2016 వరకు చర్ల దళ సభ్యుడిగా పని చేసాడు. తరువాత అగ్రనేత బడే చొక్కారావు కు గార్డ్ గా పని చేసాడు. రెండు ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. అప్పుడు ఐతు వెన్నుపూసకు దెబ్బ తగిలింది. దాంతో పార్టి లో పని చేయలేని స్థితికి చేరుకున్నాడు. గత యేడాది ఏరియా కమిటి మెంబర్ గా నియమించారు. అయితే, అనారోగ్య కారణాలు వలన లొంగి పోవాలనే ఉద్దేశంతో చివరకు తన బంధువు సహాయంతో పోలీసుల ముందుకు వచ్చాడు