జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ని జోథ్ పూర్ సెషన్స్ కోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, బెయిల్ ఆర్డర్ కాగితాలు జైలు అధికారులకు అందిన అనంతరం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది.నాటకీయ పరిణామాల నడుమ.. రూ.50 వేల పూచీకత్తుపై సల్మాన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్ కోర్టు శనివారం మధ్యాహ్నం తీర్పు చెప్పింది. ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే జోధ్‌పూర్ జైలు నుంచి హీరో విడుదలయ్యే అవకాశంఉంది. గురువారం నాటి తీర్పుతో జైలుపాలైన సల్మాన్.. శుక్రవారమే బెయిల్ కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు. అయితే న్యాయమూర్తుల బదీలల కారణంగా ఆ రోజు విచారణలేవీ జరగలేదు. కృష్ణ జింకల వేట కేసును విచారిస్తోన్న జడ్జి రవీంద్ర కుమార్ జోషి కూడా బదిలీ కావడంతో శనివారం కోర్టు పనిచేస్తుందా, లేదా అనే సంశయం నెలకొంది. కానీ అనూహ్యంగా జడ్జి జోషి కోర్టుకు వచ్చి విధులు నిర్వర్తించారు. రూ.25 వేల విలువైన రెండు బాండ్లు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దనే నిబంధనలపై సల్మాన్‌కు బెయిల్ మంజూరుచేశారు.కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్షను ఎదుర్కొంటూ జోధ్‌పూర్ జైల్లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు వీవీఐపీ ట్రీట్‌మెంట్ దక్కుతుందని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. సల్మాన్ ను సాధారణ ఖైదీగా పరిగణించాల్సి ఉన్నా, అలాంటి పరిస్థితి ఏమీ లేదని, జోధ్‌పూర్ జైల్లో సల్మాన్ ను అధికారులు చాలా బాగా చూసుకుంటున్నారని తెలుస్తోంది.సల్మాన్‌కు సమస్త సౌకర్యాలూ ఏర్పాటు చేశారని, రాత్రిళ్లు సల్మాన్ కు మంచి పడక సౌకర్యం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. డ్రస్సింగ్ విషయంలో కూడా సల్లూ ఇంకా ఖైదీల యూనిఫారమ్‌లోకి మారలేదని, తన రంగు రంగుల బట్టల్లోనే ఉంటున్నాడని సమాచారం.సల్మాన్ కు తగిన జైలు దుస్తులు ఇంకా తయారు కాలేదని, అందుకే అతడిని సొంత బట్టలు వేసుకునేందుకు అధికారులు అనుమతినిచ్చారనే మాట వినిపిస్తోంది. ఇక జైల్లో సల్మాన్ కు రాత్రిపూట ఎయిర్ కూలర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తుండటం గమనార్హం. ఈరోజు రాత్రి ఏడున్నర గంటల సమయంలో సల్మాన్ ని విడుదల చేయవచ్చని సీనియర్ న్యాయవాది భరత్ భూషణ్ శర్మ తెలిపారు. కాగా, ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. జోథ్ పూర్ సెంట్రల్ జైలులో సల్మాన్ నలభై ఎనిమిది గంటలు గడిపాడు.