YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

12 నుంచి ఢిల్లీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు నడువనున్న రైళ్లు

12 నుంచి ఢిల్లీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు నడువనున్న రైళ్లు

12 నుంచి ఢిల్లీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు నడువనున్న రైళ్లు
న్యూ డిల్లీ మే 11,
దాదాపు ఏడు వారాల తర్వాత సాధారణ ప్రయాణికుల్ని రైలు ప్రయాణానికి అనుమతిస్తూ కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. రేపటి (మంగళవారం) నుంచి దేశ రాజధాని ఢిల్లీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు పదిహేను రైళ్లను నడపనున్నారు. అప్ అండ్ డౌన్ ను లెక్కలోకి తీసుకుంటే ముప్ఫై రైళ్లను పట్టాలెక్కించాలని డిసైడ్ చేశారు. ప్రయోగాత్మకంగా సాగే ఈ ప్రయాణం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో రైలు జర్నీసరికొత్తగా ఉంటుందని చెప్పక తప్పదు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దేశం నలుమూలకు ఈ రైళ్లను నడపనున్నారు. వీటిని రోటీన్ రెగ్యులర్ రైళ్లకు భిన్నంగా.. ప్రత్యేక రైళ్లుగా వ్యవహరిస్తారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. రానున్న రోజుల్లో రైళ్ల సంఖ్యను మరికాస్త పెంచే వీలుంది. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా ఈ రోజు సాయంత్రం (సోమవారం) నాలుగు గంటల నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్లనుఅమ్ముతారు. ఆన్ లైన్ లోనే తప్పించి.. ఆఫ్ లైన్ లో ఈ రైలు టికెట్లు అమ్మరు.ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడకు రైళ్లను నడపనున్నారన్న విషయానికివస్తే. జమ్మూతావి, అహ్మదాబాద్, ముంబయి సెంట్రల్, మడ్ గావ్,తిరువనంతపురం, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్, భువనేశ్వర్, రాంచీ,బిలాస్ పూర్, పట్నా, హౌరా, అగర్తల, దిబ్రూగడ్ స్టేషన్ల మధ్య నడుపుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైలు ప్రయాణం గతానికి పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ట్రైన్ల టికెట్లను రైల్వే స్టేషన్లలో అస్సలు అమ్మరు. అయితే.. ఈ రైళ్లు మొత్తం దేశ రాజధాని నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలకు వెళుతుండటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ రైళ్లలో జనరల్ బోగీలు ఉండవు. అంతేకాదు.. ఎలాంటి రాయితీలకు అవకాశం లేదు. మద్యలో కొన్ని స్టేషన్లలో మాత్రమే ఈ రైళ్లు ఆగనున్నాయి. ఈ రైళ్లు మొత్తం ఏసీ కావటం ఒక ఎత్తు అయితే.. సూపర్ ఫాస్టు రైళ్లకు వసూలు చేసే ఛార్జీలను వసూలు చేయనున్నారు. శ్రామిక్ రైళ్లలో ఒక బోగీలో 54 మందిని అనుమతిస్తుంటే.. ఈ ప్రత్యేక రైల్లో మాత్రం బోగీకి 72 మందిని అనుమతిస్తారు. ఏసీ రైళ్లు అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యం లో దిండు.. బెడ్ షీట్లను ఇవ్వరు. ట్రైన్ ఏసీనే అయినా.. చల్లదనం తక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. స్వచ్ఛమైన గాలి అందేలా ఏర్పాట్లు ఉంటాయి.ప్రయాణికులు ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ ను తమ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకొని ఉండాలి. ముఖానికి మాస్కు పెట్టుకోవటం.. ఫేస్ కవర్లు ధరించటం.. థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవటం తప్పనిసరి. గతలో మాదిరి కాకుండా.. ప్రయాణానికి కొన్ని గంటల ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రైల్లో ప్రయాణించే వారికి సెండాఫ్ ఇవ్వటానికి.. వెల్ కం చెప్పటానికి రైల్వే స్టేషన్లలోకి అనుమతించరు. సో.. రోటీన్ రైలు ప్రయాణానికి భిన్నంగా తాజా జర్నీ ఉంటుందని చెప్పక తప్పదు.

Related Posts