YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కామన్ వెల్త్ లో భారత్ శుభారంభం

కామన్ వెల్త్ లో భారత్ శుభారంభం

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో  భారత్ పతాకాలను సాధిస్తోంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ కు మరో స్వర్ణం వచ్చింది. నేటి ఉదయం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 77 కేజీల విభాగంలో సతీష్ కుమార్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోనే మీరాబాయి చాను తొలి స్వర్ణాన్ని అందించగా, మలి స్వర్ణాన్ని మరో వెయిట్ లిఫ్టర్ సంజిత చాను నిన్న భారత్ కు అందించింది. ఇక మూడో స్వర్ణాన్ని పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సతీష్‌ కుమార్ శివలింగం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.భారత హాకీ జట్టు డ్రాతో పోరాటాన్ని మొదలెట్టింది. పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌‌ని అద్భుతంగా ఆరంభించిన భారత్.. చివర్లో తడబడి 2-2తో డ్రా చేసుకుంది. ఆట 19వ నిమిషంలోనే 2-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ ఆ తర్వాత పట్టు సడలించింది. దీంతో.. చివరి 20 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసిన పాకిస్థాన్ మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం 4-1 తేడాతో మలేసియాని ఓడించి అద్భతమైన ఆటతీరుని కనబర్చిన నేపథ్యంలో.. భారీ అంచనాల మధ్య భారత్‌ పురుషుల జట్టు తొలి పోరుకి సిద్ధమైంది. ఈ అంచనాలను అందుకుంటూ ఆట 13వ నిమిషంలోనే దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేసి భారత్‌కి 1-0తో ఆధిక్యం‌లో నిలపగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ 19వ నిమిషంలో మరో గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఆ తర్వాత.. భారత్ ఆట రక్షణాత్మక ధోరణిలో సాగింది. దీంతో పాకిస్థాన్ జట్టు పదేపదే.. భారత్ గోల్‌పోస్టుపై దాడి చేసింది. ఈ క్రమంలోనే 38వ నిమిషంలో ఇర్ఫాన్ గోల్‌ చేసి భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగా.. ఆట ముగుస్తుందన్న దశలో (59వ నిమిషం) అలీ ముబారక్ గోల్‌‌తో మ్యాచ్‌ని డ్రాగా ముగించాడు. 

Related Posts